అరెరే.. సీన్ మారిపోయిందే.. పెళ్లి కొడుకు వచ్చాడని ఎగేసుకుని మరీ సపర్యలు చేశారు.. అంతలోనే బిగ్ ట్విస్ట్..

|

Feb 12, 2023 | 7:19 AM

కూతురు, కుమారుడు పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చాలా వర్రీ అవుతుంటారు. ముఖ్యంగా అమ్మాయి గురించి అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. పెళ్లి వయసు రాగానే.. తల్లిదండ్రులు అందరి మదిలో పెళ్లి గురించిన ఆలోచనలే ఉంటాయి.

అరెరే.. సీన్ మారిపోయిందే.. పెళ్లి కొడుకు వచ్చాడని ఎగేసుకుని మరీ సపర్యలు చేశారు.. అంతలోనే బిగ్ ట్విస్ట్..
Marriage
Follow us on

కూతురు, కుమారుడు పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చాలా వర్రీ అవుతుంటారు. ముఖ్యంగా అమ్మాయి గురించి అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. పెళ్లి వయసు రాగానే.. తల్లిదండ్రులు అందరి మదిలో పెళ్లి గురించిన ఆలోచనలే ఉంటాయి. కొన్నిసార్లు ఈ ఉత్సాహం, తొందరపాటు వల్ల తప్పులు కూడా జరుగుతాయి. వారు చేసే పొరపాట్ల కారణంగా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అయితే, పెళ్లి తంతు అంటేనే సంబరం. అందులో విచిత్ర ఘటనలు కూడా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్‌కు సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఓ అమ్మాయి తన పెళ్లి విషయంలో జరిగిన ఫన్నీ మూమెంట్‌ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. మరి ఆ ఫన్నీ మూమెంట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హర్ష రామచంద్ర అనే మహిళ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ సంఘటన గురించి సమాచారం వెల్లడించింది. తన తండ్రి తనకోసం పెళ్లి సంబంధాలు వెతుకుతున్న క్రమంలో ఎల్ఐసీ ఏజెంట్‌ను అల్లుడిగా భావించి రాచమర్యాదలు చేసిన వైనాన్ని ఈ పోస్ట్‌లో సీన్ టు సీన్ వివరించి నవ్వులు పూయించింది.

ఇవి కూడా చదవండి

ట్విట్టర్ స్టోరీ ప్రకారం.. అమ్మాయి కోసం ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయిని చూసుకునేందుకు అబ్బాయి ఇంటికి వస్తాడని సమాచారం అందించారు. ఇంకేముందు.. అలు తండ్రి, ఇటు తల్లి ఇద్దరూ హడావుడి చేశారు. ఇంతలో ఇంటి కాలింగ్ బెల్ మోగింది. అల్లుడు గారే వచ్చారని మరింత కంగారుపడిపోయారు. అతను రావడమే ఆలస్యం.. మర్యాదగా లోపలికి పిలిచ, కాఫీ, స్వీట్స్ వంటికి ముందు పెట్టి అతిథి మర్యాదలు గట్టిగానే చేశారు. ఇంత మర్యాద చేసిన తరువాత ఆ వ్యక్తి మెల్లిగా.. మీరు ఎంత పెట్టుబడి పెడతారు? అంటూ ప్రశ్నించాడు. దాంతో అతను ఏం అంటున్నాడో అర్థం కాక కాసేపు తికమకపడ్డారు అమ్మాయి పేరెంట్స్. కాసేపటి తరువాత వాస్తవం తెలుసుకుని బిత్తరపోయారు. ఇంటికి వచ్చింది ఒక ఎల్ఐసీ ఏజెంట్ అని తెలుసుకుని షాక్ అయ్యారు. కాసేపటి తరువాత తేరుకుని, వాళ్లలో వారే నవ్వుకున్నారు.

కాగా, ఈ ఫన్నీ మూమెంట్‌ని అమ్మాయి ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అది వైరల్ అయ్యింది. ఆమె పోస్ట్‌కు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఫన్నీ ఎమోజీలతో రియాక్ట్ అవుతున్నారు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..