Ginger Farming: వ్యవసాయాన్ని దండగ కాదు పండగగా మలచుకోవాలంటే.. అన్నదాత తప్పనిసరిగా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే డిమాండ్ అండ్ సప్లయి సూత్రాన్ని అన్వయించుకుంటూ.. కాలానికి పరిసరాలకు అనుగుణంగా పంటల పండిస్తే.. తప్పనిసరిగా రైతు కష్టానికి తగిన ఫలితం అందుకుంటాడు.. ఈరోజు అన్నదాతకు లాభాలను తెచ్చే అల్లం పంట గురించి తెలుసుకుందాం..
భారతీయ వంటల్లో తప్పనిసరిగా ఉండే వస్తువు అల్లం. ఇక కరోనా వచ్చిన తర్వాత అల్లంలో ఔషధగుణాలను ప్రపంచ వ్యాప్తంగా గుర్తించాయి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు తమ వంటల్లో అల్లాన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. ఏడాది పొడవునా డిమాండ్ ఉండే అల్లం.. ఎక్కువగా శీతాకాలంలో మంచి దిగుబడి ఇస్తుంది. కనుక మీకు వ్యవసాయం మీద మక్కువ ఉంటే .. ఇంట్లో కూర్చునే అల్లం పంట పండిస్తూ.. ఏకంగా లక్షలు సంపాదించవచ్చు.. అల్లం వ్యవసాయం ఎలా చేయాలి తెలుసుకుందాం..
అల్లం సాగుకి అనువైన కాలం: వ్వర్షాకాలం అల్లం సాగుకి అనువైన కాలం. ఈ సీజన్ లో అల్లం సాగు చేస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు. అల్లం పంట కోసం ముందుగా భూమిని సిద్ధం చేసుకోవాలి. పొలాన్ని రెండు, మూడు సార్లు దున్ని.. మట్టి లూజుగా ఉండలేనా చేసుకోవాలి. తర్వాత ఎరువుగా ఆవుపేడను జల్లాలి. అయితే అల్లం సాగు చేసే భూమికి నీరు నిల్వ ఉండే గుణం ఉండకూడదు. నీటి పారుదల విషయంలో డ్రిప్ ఇరిగేషన్ పద్డతిని ఏర్పాటు చేసుకుంటే పంట దిగుబడి బాగుంటుంది. ఇక హెక్టారుకు దాదాపు 3 టన్నుల వరకూ విత్తనాలు నాటుకోవచ్చు.
ఒక హెక్టారు భూమిలో అల్లం సాగు చేస్తే.. దాదాపు 50 టన్నుల అల్లం దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో అల్లంకి మంచి డిమాండ్ ఉంది. దీంతో కేజీ అల్లం రూ. 80నుంచి రూ 100 వరకూ ఉంది. వ్యవసాయానికి పెట్టిన ఖర్చులు, ఇతర పెట్టుబడి అన్ని పోను… అల్లం సాగు చేస్తే ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా సుమారు రూ. 25 లక్షల వరకూ లాభం వచ్చే అవకాశం ఉంది.
ఇక హెక్టారు భూమిలో అల్లం సాగు చేయాలంటే.. దాదాపు రూ.7 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. లాభం రూ. 25 లక్షలు అనుకుంటే.. ఖర్చులపోను.. నికర లాభం సుమారు రూ 15 లక్షల వరకూ ఉంటుంది. ఇక అల్లం సాగు చేసే వ్యవసాయ దారులకు ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది/ ప్రభుత్వం నుంచి , ముద్రా పథకం నుంచి కూడా అల్లం సాగుకి పెట్టుబడిగా తక్కువ వడ్డీతో ఋణం తీసుకోవచ్చు. అల్లం సాగు అనేది… తక్కువ స్థలంతో లాభాలను ఆర్జించే పంటఅని చెప్పవచ్చు.
Also Read: గవర్నమెంట్ ఆస్పత్రిలో కలెక్టర్ అనుదీప్ భార్యకి డెలివరీ… కలెక్టర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం..