ప్రపంచంలోనే అతి పెద్ద జంతువు, పక్షి ఏది అని అడిగితే కొంత మంది తేలిగ్గా సమాధానం చెప్పగలరు. కానీ, ప్రపంచంలోనే అతి పెద్ద కీటకం ఏది అని ఎవరైనా ప్రశ్నిస్తే చాలా మంది సమాధానం చెప్పలేరు. అయితే తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద కీటకం గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ కీటకం చాలా పెద్దది. ఇది మూడు భారీ ఎలుకల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఈ జెయింట్ క్రిమి గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ కీటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ పెద్ద కీటకం పేరు వెటా. ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. దీనిని కీటకాలలో హెవీవెయిట్ ఛాంపియన్ అంటారు. 71 గ్రాముల బరువున్న ఈ కీటకం భూమిపై అత్యంత బరువైన కీటకంగా గుర్తింపు పొందింది. అయితే, దీనిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఈ కీటకాలు నిజంగానే బరువున్నాయా..? అవి ఏం తింటాయనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. వీటికి ఇష్టమైన ఆహారం క్యారెట్. ఈ కీటకాలు క్యారెట్లను తినడానికి ఇష్టపడతాయి. అవి క్యారెట్ తింటున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
The Giant Weta is the world’s heaviest insect which at 71g is three times that of a mouse
This one is eating a carrot
📸Mark Moffett pic.twitter.com/Tj8ORufDMk
— Science girl (@gunsnrosesgirl3) November 13, 2023
భారీ బరువు తినే క్యారెట్ ఫోటోను @gansnrosesgirl3 Xలో షేర్ చేసారు. ఆ తర్వాత అది బాగా వైరల్ అవుతోంది. ఫోటోను ఫోటోగ్రాఫర్ మార్క్ మోఫెట్ క్లిక్ చేసారు. ఫోటోను షేర్ చేస్తూ.. వినియోగదారు ఇలా రాశాడు.. జెయింట్ వెటా ప్రపంచంలోనే అత్యంత బరువైన కీటకం. 71 గ్రాముల బరువు, ఎలుక కంటే మూడు రెట్లు బరువుంటుందని చెప్పారు. అవి క్యారెట్లును తింటాయని వెల్లడించారు. దీనిని మార్క్ మోఫెట్ ఫోటో తీశారు.
ఈ కీటకం న్యూజిలాండ్‌కు చెందినదని సమాచారం.అంతేకాదు, ఈ జెయింట్ వేటా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇది 17.5 సెంటీమీటర్లు లేదా 7 అంగుళాల పొడవు పెరుగుతుంది. ఈ భారీ పురుగు సాధారణ ఎలుక కంటే మూడు రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. ఒక కీటకం పిచ్చుక కంటే ఎక్కువ బరువు ఉంటుంది. వేటా అనే పేరు మావోరీ పదం నుండి వచ్చింది. ఇది శాకాహారి, తాజా ఆకులను తింటుంది. కొన్నిసార్లు అవి ఇతర చిన్న కీటకాలను కూడా తింటూ జీవిస్తాయి.. ఎలుకలు, పిల్లులు వంటి జంతువులు వాటిని వేటాడడం వల్ల వాటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..