Viral: ఉబ్బెత్తుగా 40 రోజుల చిన్నారి పొట్ట.. సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్

బిహార్​లో ఓ దంపతులు 40 రోజుల శిశువును ఆస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారి పొట్ట వద్ద ఉబ్బెత్తుగా ఉండటాన్ని వైద్యుడు గమనించారు. వెంటనే టెస్టులు చేశారు. రిపోర్ట్ చూసి వారు షాకయ్యారు.

Viral: ఉబ్బెత్తుగా 40 రోజుల చిన్నారి పొట్ట.. సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్
Fetus Inside Baby Body
Follow us

|

Updated on: May 29, 2022 | 5:12 PM

ఈ వార్త వినగానే మీరు ఆశ్చర్యానికి గురవుతారు. అసలు ఇదెలా సాధ్యమని స్టన్ అవుతారు.  బిహార్​(bihar)లోని మోతిహారీ(Motihari) జిల్లాలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. 6 వారాల వయసున్న ఓ చిన్నారి అరుదైన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడింది. 40 రోజుల శిశువు శరీరంలో పిండం పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. బిడ్డ మూత్రం పోయడంలో ఇబ్బంది తలెత్తడంతో పాటు.. పొట్ట వద్ద ఉబ్బెత్తుగా ఉండటంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు జిల్లాలోని రహ్మానియా మెడికల్ సెంటర్(Rahmania Medical Center)​కు తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు వెంటనే అన్ని రకాలు టెస్టులు చేశారు. ఈ క్రమంలోనే సీటీ స్కాన్ రిపోర్ట్ చెక్ చేసిన డాక్టర్ తబ్రీజ్ అజీజ్ షాక్‌కి గురయ్యారు. చిన్నారి  కడుపలో ఓ పిండం ఉందని, అది పెరుగుతూ వస్తోందని ఐడెంటిపై చేశారు. వైద్య పరిభాషలో ఈ స్థితిని ‘ఫీటస్ ఇన్ ఫీటు’గా పిలుస్తారట. శిశువు కడుపులో ఇంకో పిండం ఉండటం దీని మీనింగ్. దీంతో వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు డాక్టర్. వారి అనుమతితో సర్జరీకి ఏర్పాట్లు చేశారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తయిందని డాక్టర్ అజీజ్  చెప్పారు. చిన్నారి బాగానే కోలుకుందని వెల్లడించారు. పరిస్థితి కుదుటపడగానే శిశువును ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వెల్లడించారు. ఐదు లక్షల మందిలో ఒకరికే ఇలాంటి అరుదైన సమస్య వస్తుంది అని డాక్టర్ వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..