Facts: గుడ్లను డజన్లలో లెక్కించడం వెనక చాలా పెద్ద కథే ఉంది.. అసలు విషయం ఏంటంటే..

బియ్యాన్ని కేజీల్లో, ఆయిల్‌ను లీటర్లలో, పొడవును మీటర్లలో లెక్కిస్తారనే విషయం తెలిసిందే. వీటన్నింటికీ ఓ లెక్క ఉంటుంది. మరి గుడ్లను డజన్స్‌లో ఎందుకు లెక్కిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.? వినడానికి సింపుల్‌గా అనిపించినా దీని వెనక పెద్ద చరిత్ర ఉందని మీకు తెలుసా.? కోడి గుడ్లను డజన్స్‌లో ఎందుకు లెక్కిస్తారు...

Facts: గుడ్లను డజన్లలో లెక్కించడం వెనక చాలా పెద్ద కథే ఉంది.. అసలు విషయం ఏంటంటే..

Updated on: Nov 16, 2022 | 2:54 PM

బియ్యాన్ని కేజీల్లో, ఆయిల్‌ను లీటర్లలో, పొడవును మీటర్లలో లెక్కిస్తారనే విషయం తెలిసిందే. వీటన్నింటికీ ఓ లెక్క ఉంటుంది. మరి గుడ్లను డజన్స్‌లో ఎందుకు లెక్కిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.? వినడానికి సింపుల్‌గా అనిపించినా దీని వెనక పెద్ద చరిత్ర ఉందని మీకు తెలుసా.? కోడి గుడ్లను డజన్స్‌లో ఎందుకు లెక్కిస్తారు. దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కోడిగుడ్లను డజన్స్‌లో లెక్కించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటి కారణం.. గుడ్లను డజన్స్‌లో లెక్కించడం తొలుత ఇంగ్లండ్‌లో మొదలైంది. అప్పట్లో ఇంపీరియల్‌ యూనిట్‌(కరెన్సీ) సిస్టమ్‌ను వాడే వారు. వీటిలో 12 పెన్నీలను కలిపితే, 1 షిల్లింగ్‌ అవుతుంది. ఒక గుడ్డును ఒక పెన్నీకి అమ్మేవారు. దీంతో ఒక షిల్లింగ్‌ ఇవ్వడం ద్వారా 12 గుడ్లను కొనుగోలు చేసేవారు. అలా 12 గుడ్లను కొనుగోలు చేయడం ఒక అలవాటుగా మారింది. ఇప్పుడు ఆ కరెన్సీ అందుబాటులో లేకపోయినా గుడ్లను కొనుగోలు చేసే విధానం మాత్రం డాలర్లలోనే కొనసాగుతోంది.

ఇక కోడి గుడ్లను డజన్స్‌లో కొనుగోలు చేయడానికి మరో కారణం.. 12 సంఖ్యకి ఉన్న ప్రత్యేకతే. 12 సంఖ్యని రెండు భాగాలుగా చేయొచ్చు (6+6), అలాగే మూడు భాగాలుగా చేయొచ్చు (4+4+4), అంతేకాకుండా నాలుగు భాగాలుగా కూడా చేయొచ్చు (3+3+3+3). దీంతో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు, నలుగురు కుటుంబ సభ్యులున్నా గుడ్లను సరిసమానంగా సులభంగా పంచుకోవచ్చనే థియరీ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..