భారతీయ రైల్వే ఎన్నో ఆసక్తికర విషయాలకు నెలవు. ప్రతీరోజూ దేశంలో కోట్లాది మందిని తమ గమ్య స్థానాలకు చేరుస్తోంది ఇండియన్ రైల్వేస్. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్ నెట్‌వర్క్ మనది. ఇక దేశంలో ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ కూడా ఇండియన్ రైల్వేస్ కావడం విశేషం. మరి కోట్లాది మందిని క్షేమంగా తమ గమ్య స్థానాలకు చేర్చేందుకు భద్రత విషయంలో ఇండియన్ రైల్వేస్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది.
రైలు భద్రతతో పాటు, పర్యవేక్షణ కోసం రైలు లోపల, బయట ఎన్నో రకాల వస్తువులను ఉపయోగిస్తారు. ఇలాంటి పరికరాల్లో ఒకటి రైల్వే ట్రాక్‌ల పక్కన కనిపించే అల్యూమినియం బాక్సులు. సాధారణంగా మీరు రైళ్లలో ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పక్కన కొన్ని అల్యూమినియం బాక్సులు కనిపిస్తుంటాయి. ఇంతకీ అవెంటో, వాటి ఉపయోగం ఏంటో తెలుసా.? చాలా మంది వీటిని ఎలక్ట్రిక్ బాక్స్‌లుగా భావిస్తారు. ఇందులో విద్యుత్ సరఫరాకు సంబంధించినవి ఉంటాయని భావిస్తారు. అయితే అవి ఎలక్ట్రిక్ బాక్స్‌లు కావు. ఇంతకీ అవెంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
రైల్వే ట్రాక్‌ల పక్కన అక్కడక్కడ కనిపించే ఈ అల్యూమినియం బాక్స్‌ను యాక్సిల్ కౌంటర్ బాక్స్‌గా పిలుస్తారు. దీనిని రైల్వే కన్ను అని కూడా పిలుస్తుంటారు. ఈ అల్యూమినియం బాక్స్ రైలు కోచ్‌ల సంఖ్యను లెక్కిస్తుంది. అలాగే రైలు ఏ దిశలో ప్రయాణిస్తుంది.? ఎంత వేగంతో దూసుకెళ్తోంది.? లాంటి వివరాలను అంచనా వేస్తుంది. ప్రమాదాలను నివారించడానికి ఈ యాక్సిల్ కౌంటర్ బాక్స్‌లను ఉపయోగిస్తారు. ఈ బాక్సులు మూడు నుంచి ఐదు కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది. ఈ బాక్సుల్లో ఒక స్టోరేజ్ డివైజ్ ఉంటుంది. ఈ బాక్స్‌లను రైల్వే ట్రాక్‌లకు కనెక్ట్ చేస్తారు.
రైలు ఈ బాక్స్‌ను దాటినప్పుడల్లా.. ట్రాక్‌ల ప్రక్కన అమర్చిన పెట్టెలు రైలు ఇరుసులను (రెండు చక్రాలను కలిపి ఉంచే రాడ్) లెక్కిస్తాయి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి రైలు వెనుక కోచ్‌లు ఇంజిన్ నుంచి విడోపతే.. ఈ అల్యూమినియం బాక్సులు వెంటనే ఆ సమాచారం బాక్స్‌లకు అందుతుంది. దీంతో వెంటనే రెడ్ లైట్ పడుతుంది. దీంతో వెంటనే లోకో పైలట్ రైలును ఆపేస్తారు. అలాగే బోగీలు పట్టాలు తప్పిన విషయాన్ని ఈ బాక్స్‌లు సమీప రైల్వే స్టేషన్‌కు తెలియజేస్తాయి. ఒకవేల కొన్ని కోచ్‌లు రైలు నుంచి విడిపోతే ఈ యాక్సిల్ కౌంటర్ బాక్స్ సహాయంతో సదరు బోగీలు ఏ ప్రాంతంలో ఉన్నాయో కనుక్కోవచ్చు.
మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి.