Jasmine Plants: ఇంటి ఆవరణలో మల్లెపూల చెట్టు ఉంటే వాసనకు పాములు వస్తాయా? ఇది నిజమేనా?

Jasmine Plants: మల్లె చెట్టు ఉండటం వల్ల పాములు వస్తాయని భయపడి ఆ అందమైన మొక్కను తీసేయాల్సిన అవసరం లేదు. కేవలం చెట్టు చుట్టూ శుభ్రతను పాటిస్తే సరిపోతుంది. మల్లెపూలు కేవలం సువాసననే కాదు, వాస్తు ప్రకారం కూడా ఇంటికి సానుకూల శక్తిని (Positive Energy) ఇస్తాయని నమ్ముతారు..

Jasmine Plants: ఇంటి ఆవరణలో మల్లెపూల చెట్టు ఉంటే వాసనకు పాములు వస్తాయా? ఇది నిజమేనా?
Jasmine Plant

Updated on: Apr 19, 2026 | 10:45 AM

Jasmine Plants: ఇంట్లో మల్లెపూల చెట్టును పెంచుకోవడం భారతీయులకు ఒక సెంటిమెంట్. ముఖ్యంగా వేసవి కాలంలో మల్లెపూల సువాసన మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అయితే, చాలా కాలంగా ఒక ప్రచారం జరుగుతోంది. మల్లెపూల సువాసనకు పాములు ఆకర్షితమై వస్తాయని చాలా మంది అనుకుంటారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం.

మల్లెపూల సువాసనకు పాములు వస్తాయా?

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లెపూల, సన్నజాజి పూల సువాసనకు పాములు వస్తాయనేది ఒక అపోహ మాత్రమే. దీనికి శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఇక్కడ ఉన్నాయి.

1. పాములకు వాసన చూసే శక్తి ఎలా ఉంటుంది?

ఇవి కూడా చదవండి

పాములకు మనలా ముక్కుతో వాసన చూసే శక్తి ఉండదు. అవి తమ నాలుకను బయటకు చాచి గాలిలోని రసాయన కణాలను గ్రహించి పరిసరాలను అంచనా వేస్తాయి. వాటికి పూల సువాసనలతో ఎటువంటి సంబంధం లేదు.

2. ఆహారం కోసం వస్తాయి – సువాసన కోసం కాదు

మల్లె చెట్టు దట్టంగా పెరుగుతుంది. ఆ పూల సువాసనకి తేనెటీగలు, సీతాకోకచిలుకలు, ఇతర చిన్న కీటకాలు వస్తాయి. ఈ కీటకాలను తినడానికి కప్పలు లేదా బల్లులు వస్తాయి. ఈ కప్పలు, బల్లులను వేటాడటానికి పాములు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పాము వస్తే అది ఆహారం కోసం వస్తుందే తప్ప, మల్లె సువాసన పీల్చడానికి కాదు.

3. చల్లదనం కోసం

వేసవి కాలంలో మల్లె చెట్టు దట్టమైన పొదలాగా మారి, నేల భాగాన్ని చల్లగా ఉంచుతుంది. పాములు శీతల రక్త జంతువులు. అవి ఎండ వేడిని తట్టుకోలేక చల్లని ప్రదేశాల కోసం వెతుకుతాయి. దట్టంగా ఉన్న మల్లె చెట్టు కింద తేమ, చల్లదనం ఉండటం వల్ల అవి అక్కడ తలదాచుకోవచ్చు.

ఇఇ కూడా చదవండి: Vastu Plants for Wealth: మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలా? అయితే ఈ మొక్కలు తప్పనిసరి!

ఇంట్లో మల్లె చెట్టు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  1. మల్లె, సన్న జాజి చెట్టు ఉండటం వల్ల పాములు నేరుగా రావు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భయం లేకుండా ఉండొచ్చు:
  2. చెట్టును దట్టంగా పెరగనివ్వకండి: మల్లె చెట్టును ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. కింద నేల భాగం స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి.
  3. పరిసరాల శుభ్రత: చెట్టు కింద రాలిన ఆకులు, ఎండు పుల్లలు పేరుకుపోకుండా చూసుకోవాలి. అవి పేరుకుపోతే పాములకు దాక్కోవడానికి అనువుగా మారుతుంది.
  4. ఎలుకలు, కప్పలు లేకుండా చూడటం: ఇంట్లో ఎలుకలు లేదా తోటలో కప్పలు ఎక్కువగా ఉంటే వాటిని నియంత్రించాలి. ఎందుకంటే ఇవే పాములను ఆకర్షిస్తాయి.
  5. లైటింగ్: రాత్రి పూట మల్లె చెట్టు ఉన్న ప్రాంతంలో వెలుతురు ఉండేలా చూసుకోండి.

మల్లె చెట్టు ఉండటం వల్ల పాములు వస్తాయని భయపడి ఆ అందమైన మొక్కను తీసేయాల్సిన అవసరం లేదు. కేవలం చెట్టు చుట్టూ శుభ్రతను పాటిస్తే సరిపోతుంది. మల్లెపూలు కేవలం సువాసననే కాదు, వాస్తు ప్రకారం కూడా ఇంటికి సానుకూల శక్తిని (Positive Energy) ఇస్తాయని నమ్ముతారు.

ఇది కూడా చదవండి: Personal Finance: కేవలం రూ.1000తో మొదలు పెట్టండి.. ఐదేళ్లలో రూ.10 లక్షలు మీ సొంతం!

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు.. ఆ 92 నిమిషాలే కీలకం!

Follow Us