Boy Propose to Girl: ప్లీజ్ నా గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటావా?.. అదిరిపోయే రిప్లై ఇచ్చిందిగా!.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న స్క్రీన్‌షాట్..

|

Mar 06, 2021 | 5:47 AM

Boy Propose to Girl: తమకు నచ్చిన వారిని ఇంప్రెస్ చేయడం కోసం అబ్బాయిలు గానీ, అమ్మాలు గానీ రకరకాలుగా ట్రై చేస్తుంటారు.

Boy Propose to Girl: ప్లీజ్ నా గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటావా?.. అదిరిపోయే రిప్లై ఇచ్చిందిగా!..  సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న స్క్రీన్‌షాట్..
Follow us on

Boy Propose to Girl: తమకు నచ్చిన వారిని ఇంప్రెస్ చేయడం కోసం అబ్బాయిలు గానీ, అమ్మాలు గానీ రకరకాలుగా ట్రై చేస్తుంటారు. విష్ చేయడం, మెసేజ్ చేయడం, గిఫ్ట్‌లు ఇవ్వడం చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే, తాజాగా ఢిల్లీకి చెందిన 11వ తరగతి చదువుతున్న విద్యార్థి తనకు గర్ల్ ఫ్రెండ్‌గా ఉంటావా? అంటూ ఓ యువతికి పంపిన రిక్వెస్ట్ సందేశం తెగ వైరల్ అవుతోంది. ఆ మెసేజ్ తాలూకు స్క్రీన్ షాట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఆ సందేశానికి నెటిజన్లు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో ప్రేమ అనేది కామన్ అయిపోయింది. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా తమ అభిప్రాయాలను వెంటనే ఎదుటివారికి చెప్పేస్తున్నారు. అందుకోసం తమలోని ట్యాలెంట్‌ని అంతా తీసి వాడేస్తుంటారు. తాజాగా ఇక్కడా అదే జరిగింది. 11 వ తరగతి విద్యార్థి కూడా ఇలాంటిదే చేశాడు. యాంటీ పీజియాన్ పేరుతో గల ట్విట్టర్ యూజర్.. ఒక స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఆ స్క్రీన్ షాట్‌లో ‘నేను ఢిల్లీకి చెందిన వాడిని.. ఇప్పుడు నేను 11వ తరగతి విద్యార్థిని. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్ అవుతావా?’ అని మెసేజ్ పెట్టాడు. అయితే, ఎదుటి నుంచి అతనికి రెస్పాన్స్ రాలేదు. దాంతో ఆ యువకుడు మరో మెసేజ్ పెట్టాడు. ‘మా నాన్న చాలా పెద్ద షిప్పింగ్ వ్యాపారి. నేను నీకోసం ఏమైనా చేయగలను. ప్లీజ్ నా గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండు’ అంటూ అభ్యర్థించాడు.

ఆ మెసేజ్‌ స్క్రీన్‌షాట్‌ని సదరు ట్విట్టర్ యూజర్ షేర్ చేసింది. అంతేకాదు.. ఫన్నీ కామెంట్ కూడా పెట్టింది. ‘దయచేసి స్కూల్‌ని తిరిగి ప్రారంభించండి బాబోయ్’ అని పేర్కొంది. దాంతోపాటు.. ‘అతని రిక్వెస్ట్‌ను నేపు పట్టించుకోవడం లేదు. ఇది కేవలం సరదాగా మాత్రమే. ఇతను తన తండ్రి బలం గురించి నాకు చెబుతున్నాడు.’ అంటూ తన అభిప్రాయాన్ని రాసుకొచ్చింది. కాగా, ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు దీనిపై డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. అయితే, కాసేపటికే సదరు ట్విట్టర్ యూజర్ స్కీన్‌షాట్ పోస్ట్‌ను ప్రైవేట్‌లో పెట్టడం విశేషం.

Also read:

Earning from Garbage: మీకు ఈ విషయం తెలుసా?.. వ్యర్థాలతో డబ్బులే డబ్బులు.. ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ గ్రామం..!

Farmers Protest: 100వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు.. నల్లజెండాలు ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..