Whatsapp
అరచేతిలో ఆధునిక ప్రపంచం.. ఎక్కడి విషయాలనైనా.. ఏ సమాచారమైన క్షణాల్లో తెలుసుకోవచ్చు.. వీక్షించవచ్చు.. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రపంచంలో ఏం జరిగినా సోషల్ మీడియా ద్వారా ఇట్టే పసిగట్టొచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఒకటైన వాట్సాప్ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఉదయాన్నే నిద్రలేచిన నుంచి.. రాత్రి పడుకునే ముందు వరకు మనం వాట్సప్ చూస్తూనే ఉంటాం.. వాట్సాప్ మెసెజెస్, స్టేటస్‌తో పాటు ఇంకా ఫొటోలు, వీడియోలు.. వాయిస్ మెస్సెజ్ లు ఇలా అన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం.. ప్రస్తుతం వాట్సాప్ మన జీవితంలో ఒక భాగంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాట్సప్ ను వినియోగిస్తున్నారు. మన దేశంలో కూడా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఈ వాట్సప్ యాప్ కొన్ని దేశాల్లో మాత్రం పని చేయదు. ఆయా దేశాలు వాట్సప్ వినియోగించకుండా నిషేధం విధించారు.. ఆయా దేశాల సమాచారం వేరే దేశాలకు వ్యాప్తి చెందుతుందన్న కారణలతో బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఏయే దేశాల్లో పని చేయదో తెలుసుకోండి..
- చైనా: కమ్యూనిస్టు దేశమైన చైనాలో వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా యాప్ లు పనిచేయవు.. కట్టుదిట్టమైన భద్రత కారణంగా ఈ దేశంలోని ప్రజలు వాట్సాప్‌ను ఉపయోగించకుండా నిరోధించారు. అయితే, VPN ద్వారా యాప్‌ని ఉపయోగించడానికి అనుమతి ఉంది. వాట్సాప్‌కు బదులుగా చైనా వాసులు వారి సొంత సోషల్ మీడియా యాప్ WeChatని ఉపయోగిస్తారు.
- ఇరాన్: ఇస్లాం దేశమైన ఇరాన్‌లో కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనల కారణంగా ఇరాన్ ప్రభుత్వం వాట్సాప్‌ను నిషేధించారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ జియోనిస్ట్ కుట్రలో భాగమని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అందుకే ఈ మేసేజింగ్ యాప్ పనిచేయకుండా నిషేధం విధించారు.
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వ ఆంక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ దేశంలో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు ఉన్నాయి. అయితే, ముఖ్యమైన ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇక్కడ వాట్సాప్ ఒక్కటే కాదు.. విదేశీ యాప్‌లు, వెబ్‌సైట్లు, పోషల్ మీడియా.. ఇలా అన్నింటిపై నిషేధం ఉంది.
- సిరియా: 2011 సంవత్సరం నుంచి సిరియా అంతర్యుద్ధంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా సిరియన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై నిషేధం విధించింది. వాట్సప్ సహా అమెరికాకు చెందిన అన్ని యాప్‌లను ఉపయోగించకుండా నిషేధం విధించారు.
- టర్కీ: పర్యటక దేశమైన టర్కీలో కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై కఠిన ఆంక్షలున్నాయి. ఈ దేశంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ లాంటివి పూర్తిగా నిషేధించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందన్న కారణంతో కఠిన చట్టాలను అమల్లోకి తీసుకువచ్చారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..