పెళ్లి మండపంలో బంధుమిత్రుల కోలాహలం.. లక్షల రూపాయలు వెచ్చించి చేయించిన మండపం.. వావ్ అనేలా భోజనాలు.. మాట రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ చివరకు పెళ్లి కూతురు ఇచ్చిన ట్విస్ట్‌కు అందరి మైండ్ బ్లాంక్ అయ్యింది. సరిగ్గా మూడు ముళ్లు వేసే సమయంలో తనకు ఈ పెళ్లి వద్దని.. తాళి కట్టించుకునేందుకు నిరాకరించింది. దీంతో పెళ్లి పెటాకులయ్యింది. ఈ ఘటన చిత్రద్రుగ జిల్లా హోసదుర్గ తాలూకా చిక్కబ్యాలడకెరె గ్రామంలో చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిత్రదుర్గ జిల్లా హోసదుర్గ తాలూకా చిక్కబ్యాలడకెరె గ్రామంలో మంజునాథ్, ఐశ్వర్యల వివాహం నిశ్చయమైంది. దీంతో గ్రామంలోని భైరవేశ్వర కల్యాణ మండపంలో కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లికొడుకు తాళి కడితే వివాహం అయిపోయినట్టే. అయితే పెళ్లికూతురు ఐశ్వర్య చివరి క్షణంలో పెళ్లికి నిరాకరించింది. తాళి కట్టేందుకు లేచిన వరుడు.. పెళ్లి కూతురు ప్రవర్తనతో బిత్తరపోయాడు. ఐశ్వర్యను ఒప్పించేందుకు బంధువులు ఎంతో ప్రయత్నించారు. కానీ యువతి ససేమేర అంది. పెళ్లి కూతురు చేసిన పని పెళ్లి కొడుకు బంధువులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఇరు వారి కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగి చివరకు పెళ్లి రద్దు అయింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..