Business Idea: భలే ఉపాయం.. ఈ బిజినెస్‌తో కాసుల వర్షం పక్కా..

ప్రస్తుతం పెంపుడు జంతువులను పెంచుకోవడం ఒక అలవాటుగా మారింది. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన ఈ ట్రెండ్‌ ఇప్పుడు చిన్న చిన్న నగరాలకు సైతం వ్యాపించింది. అయితే పెంపుడు జంతువులను పెంచడం సరదాగే అనిపించినా, వాటిని మెయింటెనెన్స్ మాత్రం కష్టంతో కూడుకున్న విషయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా జంతువుల వెంట్రుకలు, గోల్లు కత్తిరించడం...

Business Idea: భలే ఉపాయం.. ఈ బిజినెస్‌తో కాసుల వర్షం పక్కా..
Business Idea
Follow us

|

Updated on: May 10, 2024 | 6:51 PM

ప్రతీ అవసరం నుంచే ఒక ఆలోచన పుడుతుందని చెబుతుంటారు. ఆ ఆలోచనను వ్యాపార ఐడియాగా మార్చుకుంటే కాసుల వర్షం కురిపించొచ్చు. ఎందో ఔత్సాహిక వ్యాపారవేత్తలు దీనిని నిజం చేసి చూపించారు. తాజాగా లూథియానాకు చెందిన కొందరు ఇలాంటి వెరైటీ ఆలోచనే చేశారు. లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇంతకీ ఏంటా బిజినెస్‌.? ఎలా ప్రారంభించాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం పెంపుడు జంతువులను పెంచుకోవడం ఒక అలవాటుగా మారింది. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన ఈ ట్రెండ్‌ ఇప్పుడు చిన్న చిన్న నగరాలకు సైతం వ్యాపించింది. అయితే పెంపుడు జంతువులను పెంచడం సరదాగే అనిపించినా, వాటిని మెయింటెనెన్స్ మాత్రం కష్టంతో కూడుకున్న విషయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా జంతువుల వెంట్రుకలు, గోల్లు కత్తిరించడం వాటి ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రులకు వెళ్లడం రిస్క్‌తో కూడుకున్న అంశం.

అయితే ఇప్పటికే ఇలాంటి సేవలు అందించే కేంద్రాలు ఎన్నో ఉన్నాయి అంటారా.? అయితే లుధియానాకు చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్తలు. ఇంటి వద్దకే వచ్చి అందించే సేవలను ప్రవేశపెట్టారు. ఇందుకోసం ఒక వ్యాన్‌ను కొనుగోలు చేసి బాగా డెకరేషన్‌ చేశారు. “హమ్ తుమ్ ఔర్ పూంచ్” పేరుతో పింక్ మొబైల్ గ్రూమింగ్ వ్యాన్ ఏర్పాటు చేసి అవసరం ఉన్న వారి ఇళ్లకు వెళ్లి జంతువులకు సేవలు అందిస్తున్నారు. హెయిర్ కట్ సహా అనేక సేవలు అందిస్తున్నారు.

మీరు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సెకండ్ హ్యాండ్‌లో లేదా కొత్త వ్యాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందే వరకు చిన్న వ్యాన్‌ను తీసుకొని ప్రాంరభించవచ్చు. అనంతరం మీ అవసరానికి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా పెద్ద వాహనాన్ని సమకూర్చుకోవచ్చు. ఇందులోనే జంతువులకు వైద్య సేవలు సైతం అందించవచ్చు. ఇందుకోసం ఒక పెట్ డాక్టర్‌ను రిక్రూట్ చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ