కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఏడాది ప్రారంభంలోనే దేశంలోని బ్యాంకులకు ఎన్ని సెలవులు అనే జాబితా విడుదలవుతుంది. సాధరణంగా ప్రతినెల రెండవ, నాలుగవ శనివారాలతోపాటు ఆదివారాలు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. అవే కాకుండా పండుగల రోజున కూడా బ్యాంకులు పనిచేయవు. మరీ ఈ సంవత్సరం ఎప్పుడెప్పుడు బ్యాంకులు పనిచేయవో తెలుసుకుందామా..
ఈ ఏడాది ప్రారంభంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2021లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలిపింది. జనవరి నెలలో కూడా బ్యాంకులకు కొన్ని సెలవులు ఉన్నాయి. కానీ ఒక్కోసారి బ్యాంకుల సెలవు తేదీలు రాష్ట్రం ప్రాతిపాదికన మారుతూ ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెలలో 11వ తేదీన రెండో శనివారం కాబట్టి ఆ రోజు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత 15, 16 తేదీల్లో సంక్రాంతి పండగ కారణంగా ఆ రోజు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇక 25న నాలుగో శనివారం, 26న ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు బ్యాంకులు పనిచేయవు.
తర్వాత తెలంగాణలో జనవరి 1న బ్యాంకులకు సెలవు ఉందని తెలుస్తోంది. అలాగే సంక్రాంతికి ఒక్క రోజు మాత్రమే సెలవు ఉండేలా ఉంది. ప్రస్తుతం చాలా మంది మొబైల్ బ్యాంకింగ్‌కు అలవాటు పడిపోయారు. దీంట్లో అమౌంట్ పేమెంట్, నగదు పంపడం వంటి వాటికి ఎలాంటి ఆటంకం లేదు. ఇలా కాకుండా నేరుగా బ్యాంకులోనే పని ఉంటే మాత్రం ముందు రోజు తెలుసుకొని వెళ్ళండి. బ్యాంకులకు ఏ రోజున సెలవు అనేది కనుక్కొని వెళ్తే ఆ రోజుకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటుంది.