What An Idea: పందిని అమ్మకానికి పెట్టాడు.. మెదడుకు పదును పెట్టి.. వినూత్నంగా మార్కెట్ చేశాడు

Small Business Idea: ఎడారిలో మంచి నీరు అమ్మడం ఎవరైనా చేస్తారు.. అదే ఎడారిలో ఖర్జూరాలను అమ్మేవాడు అసలు సిసలైన వ్యాపారి. ప్రజల్లోకి ఏ వ్యాపారం వెళ్లాలన్నా .. అమ్మకాలు పెరిగి..

What An Idea: పందిని అమ్మకానికి పెట్టాడు.. మెదడుకు పదును పెట్టి.. వినూత్నంగా మార్కెట్ చేశాడు
Pig Business
Follow us

|

Updated on: Apr 14, 2021 | 1:51 PM

What An Idea: ఎడారిలో మంచి నీరు అమ్మడం ఎవరైనా చేస్తారు.. అదే ఎడారిలో ఖర్జూరాలను అమ్మేవాడు అసలు సిసలైన వ్యాపారి. ప్రజల్లోకి ఏ వ్యాపారం వెళ్లాలన్నా .. అమ్మకాలు పెరిగి లాభాల బాట పట్టాలన్నా మార్కెటింగ్ ముఖ్యం. అందుకనే బడా కంపెనీల నుంచి చిన్న చిన్న వ్యాపార సంస్థలు కూడా వారి స్థాయికి తగినట్లు ప్రకటనలు ఇస్తారు. కొన్ని కంపెనీలు ఏకంగా కోట్లు కూడా ఖర్చు పెడతాయి. ఎంతగా మార్కెట్ పై దృష్టిపెడతాయంటే.. వస్తువు ఉత్పత్తి చేసే దానికంటే.. ఆ వస్తువుని మార్కెట్ లోనికి తీసుకుని వెళ్ళడానికే ఎక్కువ ఖర్చు చేస్తాయి. ఒక సామాన్య వ్యక్తి కూడా తన వస్తువులను మార్కెట్ చేయాలనుకున్నాడు. తన పరిధిలో వినూత్న ఆలోచన చేశాడు.. దీంతో అతను వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే..

నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం కు చెందిన గూడెల్లి వరాలు అనే వ్యక్తి పందిని పెంచుకుంటున్నాడు. అయితే పండగ సమయంలో తాను పెంచుకుంటున్న పందిని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. అయితే నార్మల్ గా పందిని అమ్మితే డబ్బులు తక్కువ వస్తాయని భావించినట్లున్నాడు. దీంతో డిఫరెంట్ గా ఆలోచించి రోడ్డుపై ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు.

తాను పెంచుకున్న పందికి గులాలు చల్లి  పింక్ రంగులోకి మార్చాడు.  తాను ముఖానికి ఆ రంగు పులుముకుని నేలకొండపల్లి -కూసుమంచి ప్రధాన రహదారిపై ఆ పింక్ కలర్ పందిని ప్రదర్శన కు ఉంచాడు. దీంతో రోడ్డుమీద ప్రయాణీకులను పింక్ రంగు పంది ఆకర్షించింది. వెళ్లి వచ్చేవారు చూసి.. వివరాలను కనుక్కోవడంతో వరాలు మార్కెటింగ్ సక్సెస్ అయ్యింది. పంది పదిమందిని ఆకర్షించింది.

Also Read: వేలి ఉంగరం చూపిస్తూ.. మళ్ళీ వార్తల్లో నిలిచిన ఐటెం భామ మలైకా అరోరా..

వాటే ఐడియా సర్జీ.. రైలుబోగీలా బైక్ కి ట్రాలీ తగిలించి ఏకకాలంలో పదిమంది ప్రయాణం.. వీడియో వైరల్