చాలా సినిమాల్లో చూసినట్టుగా పడవలో ప్రయాణిస్తుండగా, అందులోకి నీళ్లు రావటం, ఆ తర్వాత పడవ నడిపే వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి కాపాడటం లేదంటే.. కొన్ని కొన్ని సందర్భాల్లో అలా పడవలోకి నీళ్లు రావటం వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా అనేకం చూస్తుంటాం.. అయితే, ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా సీలింగ్ నుండి నీళ్లు కారడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది.. అందులోని ప్రయాణికుల గుండె చప్పుడు పెరగడం ఖాయం అని చెప్పాలి. అలాంటి సంఘటనే ఇక్కడ కూడా జరిగింది. ఢిల్లీ నుంచి లండన్ గాట్విక్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే విమానంలో జరిగింది. ఇది ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో బయటకు రావడంతో ప్రజలు విపరీతంగా స్పందించారు. దీనిపై పలువురు తమ అభిప్రాయాలను కూడా తెలియజేశారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో విమానం పైకప్పు నుండి నీరు కారుతున్నట్లు చూడొచ్చు. ఈ వీడియో చూసిన జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు. విమానాల్లో ప్రయాణించేందుకు ప్రజలు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నా సౌకర్యాలు కల్పించడం లేదంటూ చాలా మంది ప్రయాణికులు వాపోతున్నారు. ఇలాంటి సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. @fl360aero అనే వినియోగదారు ద్వారా ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేశారు.. దీనితో పాటు, వినియోగదారుడు, ‘ఢిల్లీ నుండి లండన్ గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌కు మధ్య విమానంలో, ఎయిర్ ఇండియా బోయింగ్ B 787 డ్రీమ్‌లైనర్ ఓవర్‌హెడ్ స్టోరేజ్ క్యాబిన్ లీకేజీకి గురైందని చెప్పాడు. పరిస్థితిని క్యాబిన్ సిబ్బంది అత్యంత చురుకుగా పనిచేసి కంట్రోల్ చేశారని చెప్పారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై ప్రజలు రకరకాలుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
An Air India Boeing B787 Dreamliner cabin started leaking from the overhead storage area during its flight from Delhi to London Gatwick Airport (LGW), which could be due to condensastion. Cabin crew can be seen trying to manage the situation.
🎥UB1UB2 West London (Southall) pic.twitter.com/kZyfcU4vpr
— FL360aero (@fl360aero) November 25, 2023
వైరల్ అవుతున్న ఈ వీడియోపై చాల మంది జనాలు ఘాటుగా స్పందించారు. ఒక వినియోగదారు దీనిపై స్పందిస్తూ.. వామ్మో ఇది చాలా భయానక వీడియో అంటూ రాశారు. అందుకే నేను విమానంలో ప్రయాణించను అంటూ మరో వినియోగదారు రాశారు. ప్రయాణికుల ప్రాణాలకు విలువ లేదంటూ మరోక వినియోగదారు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..