Vastu Tips: వాషింగ్‌ మిషిన్‌ను ఎక్కడ పెడుతున్నారు.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..

|

Oct 25, 2024 | 11:37 AM

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ఇంట్లో వాషింగ్ మిషిన్ అనివార్యంగా మారింది. అయితే వాషింగ్ మిషన్ ఏర్పాటు విషయంలో కొన్ని వాస్తు తప్పులు చేస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో వాస్తు మిషింగ్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఏ దిశలో ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: వాషింగ్‌ మిషిన్‌ను ఎక్కడ పెడుతున్నారు.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..
Washing Machine
Follow us on

ఇంటి నిర్మాణంలో వాస్తు ప్రాముఖ్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇంటి నిర్మాణం మొదలుకాగానే వాస్తు పండితులను సంప్రదిస్తుంటారు. వాస్తు నిపుణుల అభిప్రాయాలు, సూచనల మేరకే ఇంటి నిర్మాణం చేపడుతంటారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు వర్తిస్తుందని అంటున్నారు.

ముఖ్యంగా ఇంట్లో ఏర్పాటు చేసుకునే ఫ్రిడ్జ్‌, బీరువా, వాషింగ్ మిషిన్‌ ఏర్పాటు విషయంలో పలు వాస్తు నియమాలు పాటించాలని అంటున్నారు. ఇంట్లో వాషింగ్ మిషన్‌ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాషింగ్ మిషిన్‌ను ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి.? ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం.. వాషింగ్ మిషిన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో పెట్టకూడదు. ఈశశాన్యం మూలలో బలమైన వస్తువులు పెట్టకూడదని అంటున్నారు. ఈశాన్యంలో బరువైన వస్తువులు పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. ఇది ఆర్థికంగా ప్రభావం పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు దారి తీస్తుందని చెబుతున్నారు. అందుకే పొరపాటున కూడా ఈశాన్యంలో వాషింగ్‌ మిషిన్‌లు ఏర్పాటు చేయకూడదు.

ఇంట్లో ఆగ్నేయ దిశలో వాషింగ్‌ మిషిన్స్‌ను ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఆగ్నేయంలో అగ్నికి సంబంధించిన దిశ.. వాషింగ్ మిషన్‌ నీటికి సంబంధించింది కాబట్టి రెండు విరుద్ధమైన వస్తువులను ఒకచోట ఏర్పటు చేసుకోవడం ద్వారా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు ఎక్కువుతాయి.

వాషింగ్‌ మిషన్‌ను వాయువ్య దిశలో ఉంచడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో మిషిన్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల సానుకూల ఫలితలు ఉంటాయని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇక పశ్చిమ దిశ కూడా వాషింగ్‌ మిషిన్‌కు మంచి ప్రదేశమని చెప్పొచ్చు. పశ్చిమ దిశలో వాషింగ్‌ మిషిన్‌ ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..