శ్వాస ఆగిపోయిన వెంటనే సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడంపై ప్రజలకు కల్పిస్తున్న అవగాహన మనుషులనే కాదు.. మూగజీవుల ప్రాణాలను కూడా కాపాడుతున్నాయి. తాజాగా చనిపోయిందనుకున్న ఓ వానరానికి సిపిఆర్ చేసిన ఓ వ్యక్తి ఆ మూగజీవి ప్రాణాలు కాపాడాడు. విగతా జీవిగా పడి ఉన్న ఆ వానరం సిపిఆర్ అనంతరం ఒక్కసారిగా లేచి చెంగుచెంగున ఎగరడం చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు..!
ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో జరిగింది. ఒక వానరం విద్యుత్ షాక్ గురై అక్కడ పడిపోయింది. ఆ కోతి చనిపోయింది అనుకుని అంతా వదిలేశారు. అయితే నాగరాజు అనే ఒక యువకుడు విద్యుత్ షాక్ తో పడిపోయిన కోతిని గమనించి దానికి సిపిఆర్ చేశాడు.
చాకచక్యంగా ఆ మూగ జీవికి సిపిఆర్ చేయడంతో చనిపోయిందనుకున్న వానరానికి మళ్లీ ఊపిరి వచ్చింది. ఆ మూగజీవి ఒక్కసారిగా లేచి గంతులేయడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. సకాలంలో స్పందించి చాకచక్యంగా సిపిఆర్ చేసి వానరం ప్రాణాలు కాపాడిన నాగరాజును అంతా అభినందించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..