క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే ఈ టోర్నీలో భారత క్రికెటర్లతో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు పలు రికార్డులు సృష్టించి.. ఫ్యాన్స్‌ను అసలుసిసలైన క్రికెట్ మజాను అందించారు. చాలా మ్యాచ్‌లలో 300కు పైగా పరుగులు నమోదయ్యాయి. సిక్సర్లు, బౌండరీలతో ఆటగాళ్లు పరుగుల వర్షం కురిపించారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఏకంగా 644 సిక్సర్లు నమోదయ్యాయి. ఓ వరల్డ్ కప్ టోర్నీలో నమోదైన అత్యధిక సిక్సర్ల రికార్డు ఇదే కావడం విశేషం. ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ (31 సిక్సర్లు) నిలిచాడు. అలాగే దక్షిణాఫ్రికా అత్యధిక సిక్సర్లు (99) సాధించిన జట్టుగా నిలిచింది. అయితే రోహిత్ శర్మ, దక్షిణాఫ్రియా ఆటగాళ్లు ఎవరూ.. ఈ టోర్నీలో భారీ సిక్సర్లు కొట్టిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. వరల్డ్ కప్ టోర్నీలో కొన్సి భారీ సిక్సర్లు 100 మీటర్ల దూరాన్ని అధిగమించాయి.
మరి ఈ వరల్డ్ కప్ టోర్నీలో భారీ సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
2023 వరల్డ్ కప్‌లో 100 మీటర్ల దూరానికి పైగా రెండు సిక్సర్లు బాదిన ఏకైక ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ ఘనత సాధించాడు. అయ్యర్ కొట్టిన ఓ సిక్సర్ 106 మీటర్లు, మరో సిక్సర్ 101 మీటర్ల దూరానికి వెళ్లింది.
అయ్యర్ 106 మీటర్ల భారీ సిక్సర్ వీడియో..