Watch Video: వామ్మో! 20 అడుగుల పైథాన్‌తో పరాచకాలేంట్రా పిల్ల బచ్చా.. దెబ్బకు చుట్టేసిందిగా

|

Nov 06, 2022 | 9:07 PM

సరీసృపాల్లో కొండచిలువ అత్యంత భయకరమైనది. సర్పాల మాదిరిగా ఇది వేగంగా కదలకపోయినా.. దానికి అందేంత దూరంలో ఎర ఉంటే

Watch Video: వామ్మో! 20 అడుగుల పైథాన్‌తో పరాచకాలేంట్రా పిల్ల బచ్చా.. దెబ్బకు చుట్టేసిందిగా
Python
Follow us on

సరీసృపాల్లో కొండచిలువ అత్యంత భయకరమైనది. సర్పాల మాదిరిగా ఇది వేగంగా కదలకపోయినా.. దానికి అందేంత దూరంలో ఎర ఉంటే మాత్రం అస్సలు వదిలిపెట్టదు. భారీ జంతువులను సైతం అమాంతం మింగేస్తాయి. అందుకే కొండచిలువలకు మిగతా జంతువులు దూరంగా ఉంటాయి. అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న కొండచిలువ వీడియో చూస్తే మీరు భయపడటం పక్కా.. మరి అదేంటో చూసేద్దాం..

పైన పేర్కొన్న వీడియోను చూసినట్లయితే.. ఓ కేర్ టేకర్ కొండచిలువను మోసుకుని తీసుకెళ్తున్నట్లు మీరు చూడవచ్చు. సుమారు 20 అడుగులపైనే ఉన్న ఓ భారీ సైజ్ కొండచిలువను బోనులో వేసేందుకు ఓ కేర్ టేకర్ మోసుకెళ్తున్నాడు. అయితే ఆ కొండచిలువ మాత్రం మనోడిని గట్టిగా చుట్టేసి ఊపిరాడకుండా చేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, వీడియోలోని కొండచిలువ పేరు లూసీ కాగా, ఆ కేర్ టేకర్ పేరు బ్రియన్ బర్జిక్.. మిచిగాన్‌కి చెందిన బ్రియన్ సరీసృపాల జూ నడుపుతున్నాడు. తరచూ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పాములకు, కొండచిలువలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను అప్‌లోడ్ చేస్తుంటాడు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ లుక్కేయండి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం..