ఇష్.. ఇష్.. ఇస్మార్టు.. టైటిల్ సాంగ్ అదుర్స్!

Ram Ismart Shankar, ఇష్.. ఇష్.. ఇస్మార్టు.. టైటిల్ సాంగ్ అదుర్స్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా నుండి ఇప్పటికే ‘దిమాక్ ఖరాబ్’.. ‘జిందాబాద్ జిందాబాద్’ అనే రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ కాగా .. తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది చిత్ర యూనిట్.

హీరో పాత్రను ప్రతిబింబించేలా.. ఈ సాంగ్ మాస్ బీట్‌తో మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. “గడబిడలకు బేఫికర్ సడక్ సడక్ కడక్ పొగర్ ఇస్టైల్ దేఖో నీచే ఊపర్ ఇష్ ఇష్ ఇష్మార్టు.. నామ్ బోలెతో గల్లీ హడల్.. డబల్ దిమాక్ ఉంది ఇధర్ కర్లే అప్ని నీచే నజర్” అంటూ సాగే ఈ సాంగ్‌కు సంగీతం మణిశర్మ అందించగా.. లిరిక్స్ భాస్కర్‌బట్ల సమకూర్చారు. ఇకపోతే నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *