Winter: చలికాలంలో బరువు పెరిగే సమస్య.. ఈ ఫుడ్స్‌తో పరిష్కారం

వింటర్ సీజన్‌లో చలి వల్ల శరీరం మెటబాలిజం స్లో అవుతుంది, క్రేవింగ్స్ పెరుగుతాయి. అంతేకాదు, వరుస పండగలు, సెలవుల వల్ల ఎక్కువగా తినడం, దాని వల్ల బరువు పెరగడం సాధారణం. అయితే వైద్యుల సలహాతో చిన్న చిన్న టిప్స్​ ఫాలో అయితే ఈ సమస్యను ..

Winter: చలికాలంలో బరువు పెరిగే సమస్య.. ఈ ఫుడ్స్‌తో పరిష్కారం
Winter Foods

Updated on: Nov 23, 2025 | 11:31 PM

వింటర్ సీజన్‌లో చలి వల్ల శరీరం మెటబాలిజం స్లో అవుతుంది, క్రేవింగ్స్ పెరుగుతాయి. అంతేకాదు, వరుస పండగలు, సెలవుల వల్ల ఎక్కువగా తినడం, దాని వల్ల బరువు పెరగడం సాధారణం. అయితే వైద్యుల సలహాతో చిన్న చిన్న టిప్స్​ ఫాలో అయితే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. కొన్నిరకాల ఆహారపదార్థాలను చలికాలంలో తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దానివల్ల అధిక బరువు సమస్య ఏర్పడకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. ఇంతకీ ఆ సూపర్​ ఫుడ్స్​ ఏంటో తెలుసుకుందాం..

జీరా-వాము నీళ్లు

వారానికి 3-4 రోజులు ఉదయం పరగడపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ నీటిలో 1/2 టీస్పూన్ జీలకర్ర, వాము వేసి 5-10 నిమిషాలు మరిగించి, వడకట్టి తాగాలి. ఇది జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఉబ్బరం, వికారం తగ్గిస్తుంది. జీరాలోని క్యుమినాల్డెహైడ్ మెటబాలిజం 3% పెంచుతుంది. చలివల్ల జీర్ణక్రియ మందగించకుండా ఉంచేందుకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

సజ్జలు

చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఒకటైన సజ్జలను రోటీ లేదా ఖిచ్డీలా చేసుకుని రోజూ తినాలి. 100 గ్రాముల సజ్జల్లో 11 గ్రాములు ఫైబర్, 11 గ్రాములు ప్రోటీన్ ఉంటాయి. ఇది బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంచి, ఇన్సులిన్ స్పైక్‌లను అరికట్టుతుంది. వీటిని డైట్​లో చేర్చుకోవడం వల్ల వారానికి 0.5-1 కేజీ బరువు తగ్గవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు ఇవి బాగా సహకరిస్తాయి.

జొన్న

జొన్నలను రకరకాల రూపాల్లో తీసుకోవచ్చు. రొట్టె, అంబలి, ఉప్మా, దోశలు.. ఇలా రకరకాల వెరైటీలను చేసుకుని తినవచ్చు. జొన్నల లో-గ్లైసెమిక్ ఇండెక్స్ (55) వల్ల క్రేవింగ్స్ తగ్గుతాయి. ఫైబర్ ఎక్కువ కాబట్టి, కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. హార్వర్డ్ స్టడీ ప్రకారం, జొవర్ లాంటి మిల్లెట్స్ ఊబకాయం రిస్క్‌ను 20% తగ్గిస్తాయి. వీటిలో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.

రాగి

రాగి సంకటి, రాగి అంబలి, దోశలు, రొట్టెలు, ఇడ్లీలు అంటూ చాలా రకాల వెరైటీలు చేసుకోవచ్చు. రాగుల్లో కాల్షియం (344 మి.గ్రా/100గ్రా) ఎక్కువ కాబట్టి, థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. యూనివర్సిటీ ఆఫ్ టొరాంటో అధ్యయనం ప్రకారం రాగి డైట్‌తో 4 వారాల్లో 2-3 కేజీల బరువు తగ్గవచ్చు. చలికాలంలో ఎముకల ఆరోగ్యానికి ఇవి మంచి ఔషధంగా పనిచేస్తాయి.

డ్రైఫ్రూట్స్​

రోజూ ఒక గుప్పెడు బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలోని హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్ వల్ల మెటబాలిక్ రేట్ 10% పెరుగుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం, ఇవి వింటర్ క్రేవింగ్స్‌ను 30% తగ్గిస్తాయి. బాదంలోని విటమిన్ E చలి వల్ల చర్మం పగలకుండా కాపాడుతుంది.

వెజిటేబుల్ సూప్స్​

క్యారెట్, బ్రోకలీ, పాలకూరతో చేసిన సూప్​లు తరుచుగా తాగాలి. లో-క్యాలరీ, హై-వాల్యూమ్ కాబట్టి కడుపు నిండుగా ఉంటుంది. సూప్ డైట్‌తో వారానికి కిలో బరువు తగ్గవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలోని విటమిన్​ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి సీజనల్​ వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది.

Follow Us