Ginger Tea: చలికాలంలో అల్లం టీ మ్యాజిక్‌‌.. రోజూ తాగితే సంపూర్ణ ఆరోగ్యం గ్యారంటీ!

చలికాలం ప్రారంభమైంది.. రోజురోజుకీ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఈ సీజన్​లో ఒంట్లో వేడిని పెంచే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. అందులోనే శరీరానికి మేలు చేసే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో ఉదయాన్నే అల్లం టీ తాగితే శరీరంలో వేడి స్థిరంగా ..

Ginger Tea: చలికాలంలో అల్లం టీ మ్యాజిక్‌‌.. రోజూ తాగితే సంపూర్ణ ఆరోగ్యం గ్యారంటీ!
Ginger Tea

Updated on: Nov 20, 2025 | 10:17 AM

చలికాలం ప్రారంభమైంది.. రోజురోజుకీ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఈ సీజన్​లో ఒంట్లో వేడిని పెంచే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. అందులోనే శరీరానికి మేలు చేసే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో ఉదయాన్నే అల్లం టీ తాగితే శరీరంలో వేడి స్థిరంగా ఉంటుంది. ఇది సాధారణ డ్రింక్ మాత్రమే కాదు, ఒక పవర్‌ఫుల్ నేచురల్ రెమెడీ.

అల్లంలో జింజరాల్స్, షోగాల్స్ అనే కాంపౌండ్లు యాంటీ-ఆక్సిడెంట్స్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్‌ ఉంటాయి. NCBI రిసెర్చ్ ప్రకారం, అల్లం యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-నాయూసియా ఎఫెక్ట్స్‌తో శరీరాన్ని రక్షిస్తుంది. చలికాలంలో దగ్గు, జలుబు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. అల్లం టీ రోజూ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అల్లం శరీరంలో వేడిని పెంచడమే కాదు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అల్లం టీ రోజూ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం…

ఇన్ఫెక్షన్లకు చెక్​

చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణం. అల్లం టీలోని జింజరాల్స్ గొంతు నొప్పి, దగ్గును తగ్గించి, శ్వాసకోశ సమస్యలను అరికడతాయి. అల్లం యాంటీ-మైక్రోబయల్ ప్రాపర్టీస్‌తో బాక్టీరియా, వైరస్‌లను చంపుతుంది. రోజూ ఒక కప్ అల్లం టీ తాగితే, ఫ్లూ, జలుబు రిస్క్ 30% తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అల్లంలోని విటమిన్ C, మెగ్నీషియం రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

చలికాలంలో మెటబాలిజం తగ్గుతుంది. గ్యాస్, జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి. అల్లం జీర్ణరసాలను పెంచి, గ్యాస్‌ను తగ్గిస్తుంది. అల్లం గట్ హెల్త్‌ను మెరుగుపరచి ఉబ్బరం, వికారాన్ని తగ్గిస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్‌ను వేగవంతం చేస్తుంది. చలికాలంలో హెవీగా ఉండే ఆహారం జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.

చలికాలంలో రక్తనాళాల్లో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అల్లం రక్త ప్రసరణను మెరుగుపరచి, ఆక్సిజన్ సరఫరాని పెంచుతుంది. అల్లం LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించి, క్లాట్ ఫార్మేషన్ సమస్యను తగ్గిస్తుంది. తరచుగా అల్లం తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.

అల్లం శరీరాన్ని వేడిగా ఉంచి, లెథర్జీని అరికడుతుంది. గ్రీన్ టీతో కలిపి అల్లంని తీసుకుంటే చలికాలంలో ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, ఇది థర్మల్ సెన్సేషన్‌ను మెరుగుపరుస్తుంది, శరీరంలో శక్తిస్థాయిల్ని పెంచుతుంది. అల్లం మెన్స్ట్రువల్ క్రాంప్స్, మసల్ సోర్‌నెస్‌, ఆస్తియోఆర్థ్రైటిస్ పెయిన్‌ను తగ్గిస్తుంది. వెయిట్ మేనేజ్‌మెంట్‌కు కూడా సహాయపడుతుంది, మెటబాలిజమ్‌ను బూస్ట్ చేస్తుంది.

ఎలా చేయాలి..

తాజా అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్​ చేయాలి. ఒక కప్​ నీటిలో ఒక టీస్పూన్​ అల్లం ముక్కలు వేసి 5-10 నిమిషాలు మరిగించాలి. దాన్ని వడకట్టి తేనె, నిమ్మరసం కలిపి రోజుకి రెండు కప్పులు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Follow Us