
శరీరంపై పుట్టుమచ్చలు సర్వసాధారణం. కొందరు వీటిని అందానికి చిహ్నంగా భావిస్తారు. మరికొందరికి ఇవి అసహ్యంగా మారుతాయి. ఒంటిపై కొత్త పుట్టుమచ్చలు అకస్మాత్తుగా కనిపించడం, పుట్టుమచ్చలు పెద్దగా పెరిగడ వంటి లక్షణాలు కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది చిన్న పుట్టుమచ్చలతో ఏం సమమ్య ఉంటుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు పుట్టు మచ్చలకి, ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటంటే..
మన చర్మంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉండటం వల్ల మచ్చలు ఏర్పడతాయి. చర్మంపై మెలనోసైట్లు అనే కణాలు ఒకే చోట చేరి ఎక్కువ వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసినప్పుడు అది ఒక చిన్న మచ్చగా కనిపిస్తుంది. ఇవి నలుపు, గోధుమ, లేత గులాబీ లేదా నీలం రంగులో ఉండవచ్చు.
చాలా పుట్టుమచ్చలు ప్రమాదకరం కాదు. అయితే ఒక పుట్టుమచ్చ అకస్మాత్తుగా పరిమాణం పెరిగితే మీరు వైద్యుడిని సంప్రదించాలి.
పుట్టుమచ్చలో రెండు లేదా మూడు రంగులు కనిపిస్తే, లేదా అది నల్లగా మారితే విస్మరించకూడదు.
పుట్టుమచ్చ ఉన్న ప్రదేశంలో నిరంతర దురద లేదా నొప్పి ఉంటే.
ఒక పుట్టుమచ్చ నుంచి ఎటువంటి గాయం లేకుండా రక్తస్రావం అవుతుంటే దానిని విస్మరించకూడదు.
ఇటువంటి మార్పులు చర్మ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు కావచ్చు. కాబట్టి వాటిని విస్మరించడం మంచిది కాదు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.