Weight Loss Tips: ఈ జ్యూస్‌లను తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం.. తక్కువ రోజుల్లోనే సహజ పద్దతిలో బరువు అదుపు

Weight Loss Tips: కొంతమంది ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉంటారు. ఇలా బరువు ఉండడం ఆరోగ్యానికి హానికరం. దీంతో బరువు తగ్గడం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. యోగా, వ్యాయామం తో పాటు.. డైట్ అంటూ..

Weight Loss Tips: ఈ జ్యూస్‌లను తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం.. తక్కువ రోజుల్లోనే సహజ పద్దతిలో బరువు అదుపు
Weight Loss Tips

Updated on: Aug 05, 2021 | 12:12 PM

Weight Loss Tips: కొంతమంది ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉంటారు. ఇలా బరువు ఉండడం ఆరోగ్యానికి హానికరం. దీంతో బరువు తగ్గడం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. యోగా, వ్యాయామం తో పాటు.. డైట్ అంటూ సరైన పోషకాహారం తీసుకోకుండా పస్తులుంటారు. అయితే ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలామంది బరువు తగ్గరు.. దీంతో బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. అలా బరువు తగ్గాలని అనుకునే వారు మంచి పోషకారం తీసుకుంటూ.. తగిన వ్యాయామం చేస్తే.. బరువు తప్పనిసరిగా తగ్గుతుంది. బరువు తగ్గాలనుకుంటే వారు.. జ్యుసులను తీసుకుంటే.. తగినంత ఫలితం ఉంటుంది. జ్యూస్‌లను తాగడం వలన ఆకలి ఉండదని.. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు.. ఇక శరీరానికి తగిన పోషకాలు కూడా అందుతాయి..దీంతో ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

టమోటో జ్యూస్:

బరువు తక్కువ సమయంలో తగ్గాలనుకునేవారికి బెస్ట్ అప్షన్ టమోటో జ్యూస్. రెండు మూడు టమోటోలను తీసుకుని వాటిని ఉడికించి.. దానిని మిక్సీలో వేసి.. గ్రైండ్ చేయాలి.. ఈ జ్యూస్ లో బెల్లం కలిపి.. మళ్ళీ మిక్సీ పట్టాలి.. ఈ టమోటో జ్యూస్ ని రోజూ మూడు సార్లు తాగితే.. కేవలం ఏడు రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

లెమన్ జ్యూస్:

లెమన్ జ్యూస్‌లో చిటికెడు ఉప్పు, తేనె కలిపి.. దీనిని రోజూ ఉదయం పరగడుపున తగినట్లు అయితే.. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అంతేకాదు .. బరువు అదుపులోకి వస్తుంది.

జామ జ్యూస్:

జామకాయలో విటమిన్ సి అధికం. దీంతో వారంలో రెండు సార్లు జామ జ్యూస్ ను తాగడం వలన ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ద్రాక్ష జ్యూస్:

దీనిలో ప్రోటీన్లు, మంచి కొలస్ట్రాల్ ఉంది. దీంతో ద్రాక్ష జ్యూస్ తాగటం వలన బరువు తగ్గుతారు.

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్ బరువు తగ్గాలని అనుకునేవారికి మంచి ఎఫెక్టివ్ .జ్యూస్. గోరు వెచ్చని నీటిలో ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అవకోడా జ్యూస్:

అవకొడాలను మిక్సీ చేసుకుని .. దానిలో తేనే కలిపి తాగితే.. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది. అవకొడాలో గుడ్ కొలెస్ట్రాల్.. శరీరంలోకి కెలోరీల శాతాన్ని బర్న్ చేస్తుంది.

పైనాపిల్ జ్యూస్:

పైనాపిల్ జ్యూస్‌ తాగితే ఆకలి అదుపులో ఉంటుంది. దీంతో ఇతర ఆహారపదార్ధాలను తినాలనే కోరిక పెద్దగా కలగదు. కనుక పైనాపిల్ జ్యూస్: తాగితే సులభంగా బరువు తగ్గడానికి వీలుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: RITES Recruitment 2021: సివిల్, మెకానికల్‌పాసై ఉద్యోగం కోసం చూస్తున్నారా.. మంచి జీతంతో ఉద్యోగావకాశాలు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us