Garlic, Onions: ఉల్లి, వెల్లుల్లి ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండేది. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయని అందరికి తెలిసిందే. వీటిని ఎక్కుగా ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏ వంటకం చేయాలన్న ముందుగా నూనెలో ఉల్లిపాయలు వాడాల్సిందే. ఇవి కూరల్లో ఎంతో రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదే. వీటిలో విటమిన్ -సి, విటమిన్ బి6, పోటాషియం, ఫోలేట్ వంటివి ఉన్నాయి. వెల్లుల్లిలో వీటితో పాటు క్యాల్షియం, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం వంటివి అధిక మోతాదులో ఉంటాయి. కానీ ఇలా మన కిచెన్ లో స్టోర్ చేసిన ఉల్లి, వెల్లుల్లి మొలకలు రావడం మనం చాలా సార్లు గమనించే ఉంటాం. కొందరైతే ఆ మొలకల మేరకు కట్ చేసి వాటిని ఉపయోగించుకుంటే.. మరికొందరు వాటిని ఉపయోగించాలా? వద్దా? అన్న అనుమానాలు వస్తుంటాయి. మరి, మొలకలు వచ్చిన ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించడం మంచిదేనా?
తెలుసుకుందాం.
మామూలుగా మనం నేలలో నాటందే చాలా వరకూ మొక్కలు మొలకెత్తవు. కానీ ఉల్లి, వెల్లుల్లి మాత్రం ఎక్కడున్నా మొలకలు వస్తుంటాయి. నేలలో లేపోయినా వాటిని అలాగే ఉంచేస్తే ఆ మొలకలు పొడవుగా పెరుగుతాయి. దీనికి కారణం మన కిచెన్ లో ఉండే తేమ వాతావరణమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఉల్లి, వెల్లుల్లి మొలకెత్తేందుకు కాస్త తేమ వాతావరణం ఉంటే సరిపోతుందని అంటున్నారు. తమలో ఉన్న శక్తిని, పోషకాలను ఉపయోగించి తామే పెరుగుతాయి. ప్రత్యేకంగా నేలలో నాటకపోయినా.. ఇలా మొలకెత్తడం అనేది వాటిలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇలా మొలకెత్తడం వల్ల వాటిలో ఎలాంటి టాక్సిన్లు విడుదల కావు. కానీ అవి కాస్త జిగురుగా పాడయిపోయినట్లుగా మారిపోవచ్చు.
ఇలాంటప్పుడు కాస్త పాడైన భాగాన్ని తొలగించి మంచిగా ఉన్న భాగాన్ని ఉపయోగించుకుంటాము. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. మొలకలు అప్పుడప్పుడే వస్తున్నాయి అనిపించినప్పుడే అలాంటివాటిని పక్కకి ఉంచి ముందు వాటిని వాడేయడం వల్ల అవి పాడవక ముందే వాడే వీలుంటుంది. మొలకలు పెద్దగా అవుతున్న కొద్దీ ఉల్లి లేదా వెల్లుల్లిపాయలు కుళ్లడం మనం చూస్తూనే ఉంటాము. ఇలా కుళ్లిపోయిన వాటిని పడేయడం తప్ప ఇంకేమీ చేయలేం. చాలామందికి ఈ మొలకల రుచి చాలా ఇష్టం. అందుకే మొలకలు వచ్చే వరకూ ఆగి ఆ తర్వాత తింటుంటారు. అయితే ఈ మొలకలతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ మొలకల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోవడం కూడా మంచిదేనని వెల్లడిస్తున్నారు. అయితే ఈ మొలకలు నేరుగా తింటే కాస్త చేదుగా అనిపించవచ్చు. అందుకే ఉల్లి, వెల్లుల్లి ముక్కలతో పాటు కూరల్లో వేసుకొని తినడం మంచిది.
సాధారణంగా వంటింట్లో ఉండే తేమ కారణంగా మొలకలు వస్తుంటాయి. ఇలా కాకుండా చల్లని, పొడి ప్రదేశంలో ఉంచినట్లయితే మొలకలు రాకుండా ఉంటాయి. వాటికి గాలి తగిలేలా కూడా చూసుకోవాలి. అవి పండుతున్నప్పుడు విడుదలయ్యే ఇథలిన్ వల్ల కూడా ఉల్లిపాయలు మొలకెత్తుతాయి. వీలైతే మంచాల కింద లేదా అటక మీద వీటిని భద్రపర్చుకోవడం వల్ల మొలకలు రాకుండా ఉంటాయి.
శరీరానికి ఎంతో మేలు చేసే పదార్థాలు.. ఇవి క్రమంగా తీసుకుంటే వాటిని నుంచి తప్పించుకోవచ్చు
Immunity: రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు
మీరు రోజూ మందు కొడతారా! అయితే కాకరకాయను తినాల్సిందే.. లేదంటే ఏం జరుగుతుందో తెలిస్తే భరించలేరు.