Turmeric Side Effects: ఇలాంటి వారు పసుపును ఎక్కువగా వాడుతున్నారా..? అయితే ఆరోగ్యం పాడైపోయినట్లే..

పసుపు అనేది మన వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసు. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. పసుపు..

Turmeric Side Effects: ఇలాంటి వారు పసుపును ఎక్కువగా వాడుతున్నారా..? అయితే ఆరోగ్యం పాడైపోయినట్లే..
Turmeric

Updated on: Oct 16, 2022 | 4:47 PM

పసుపు అనేది మన వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసు. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. పసుపు అన్ని రకాల వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. పసుపులో ఉన్న ఔషధ గుణాల కారణంగా చాలా మంది ఆరోగ్య నిపుణులు దీనిని క్రమం తప్పకుండా తినమని సిఫార్సు చేస్తుంటారు. అయితే మసాలా అందరికీ ఉపయోగపడదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పసుపును ఎవరు ఎక్కువగా తినకూడదో తెలుసుకుందాం. మీరు ఈ వ్యాధుల బాధితులైతే పసుపు తినకపోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

  1. మధుమేహ: మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా తమ రక్తాన్ని పల్చగా ఉంచడానికి అనేక మందులు వాడుతుంటారు. అలాగే వారు గ్లూకోజ్ స్థాయిని నియంత్రించాలి. డయాబెటిక్ పేషెంట్లు పసుపును అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకుంటే వారి శరీరంలో రక్తం పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. ఇది శరీరానికి అస్సలు మంచిది కాదు.
  2. కామెర్లు వ్యాధిగ్రస్తులు: కామెర్లు ఉన్నవారు పసుపుకు వీలైనంతగా దూరంగా ఉండాలి. మీరు ఇంకా పసుపు వాడాలంటే దీని కోసం ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. లేకపోతే మీ ఆరోగ్యం మరింత దిగజారవచ్చు. సీరం బిలిరుబిన్ స్థాయి పెరుగుతుంది.
  3. స్టోన్ పేషెంట్స్: చాలా క్లిష్టమైన వ్యాధి. ఈ సమస్యను ఎదుర్కొనే వారు చాలా నొప్పిని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పసుపు తీసుకోవడం తగ్గించండి. లేకపోతే సమస్య పెరుగుతుంది.
  4. రక్తస్రావం ఉన్న రోగులు: ముక్కు నుండి లేదా శరీరంలోని ఏదైనా భాగం నుండి రక్తం కారుతున్న వారు పసుపు తీసుకోవడం తగ్గించాలి. లేకపోతే రక్తస్రావం పెరుగుతుంది. శరీరంలో రక్తం కోల్పోవచ్చు. ఇది బలహీనతకు కారణం అవుతుంది. భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది.
  5. ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us