Billa Ganneru: ఇంటి చుట్టుపక్కల కనిపించే ఈ మొక్క ప్రయోజనాలేమిటో తెలుసా..? తెలిస్తే ఇంట్లోనే నాటుకుని మరీ పెంచుతారు..

|

Feb 02, 2023 | 7:10 AM

ప్రకృతి ప్రసాదించిన ప్రతి మొక్కలోను ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మొక్కలు, పువ్వులు, గింజలు, కాయలు, పండ్లు ఇలా మొక్కలో..

Billa Ganneru: ఇంటి చుట్టుపక్కల కనిపించే ఈ మొక్క ప్రయోజనాలేమిటో తెలుసా..? తెలిస్తే ఇంట్లోనే నాటుకుని మరీ పెంచుతారు..
Billa Ganneru Plant For Health
Follow us on

మన ఇంటి చుట్టుపక్కల, రోడ్డు పక్కన నిత్యం ఎన్నో రకాల పూల మొక్కలను చూస్తూనే ఉంటాం. పూజకు పనికి వచ్చే పూలు లేదా తలలో పెట్టుకునే పూలను మాత్రమే మనం పూలమొక్కలుగా పరిగణిస్తాం. ఇక మిగతా మొక్కలు అన్నింటిని పిచ్చి మొక్కలుగా, పనికిరాని మొక్కలుగా భావిస్తాం. అయితే ప్రకృతి ప్రసాదించిన ప్రతి మొక్కలోను ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మొక్కలు, పువ్వులు, గింజలు, కాయలు, పండ్లు ఇలా మొక్కలో ఏదో ఒక భాగం మానవుడికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. అలా ప్రకృతిలో అందమైన మొక్కగా పేరొందిన బిళ్ళ గన్నేరు మొక్క లో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రముఖ స్థానం ఉందని చెప్పుకోవాలి. ఈ బిళ్ళ గన్నేరు పూలతో, మొక్కతో మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మొక్క  ఆకులు, పువ్వులు, వేర్లు అనేక వ్యాధులను నయం చేస్తాయి. క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు ఈ మొక్క చెక్ పెట్టగలదు. మరి బిళ్ళ గన్నేరు మొక్క వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకొందాం..

డయాబెటిస్: బిళ్ళ గన్నేరు మొక్క సేకరించి మంచి నీటిలో శుభ్రంగా కడగాలి. తరువాత ఆ వేర్లను ఎండబెట్టి పొడి చేసుకుని ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి. అరటేబుల్ స్పూన్ బిళ్ళగన్నేరు పొడికి టేబుల్ స్కూల్ తేనెను కలిపి ప్రతి రోజూ పరగడుపున, రాత్రి అన్నం తినే ముందు తినాలి. ప్రతిరోజూ ఇలా చేయడం ద్వారా డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. ఒక నెల రోజుల పాటు ఇలా చేస్తే ఎటువంటి షుగర్ వ్యాధి అయినా సరే కచ్చితంగా తగ్గుతుంది.

క్యాన్సర్: బిళ్ళ గన్నేరు పొడితో డికాషన్ తయారు చేసుకొని తాగడం వలన క్యాన్సర్ తగ్గుతుంది. లేదంటే బిల్లగన్నేరు ఆకుల రసం తీసి ప్రతిరోజు తాగినా కూడా క్యాన్సర్ నుంచి బయట పడవచ్చు.

ఇవి కూడా చదవండి

బీపి: బిల్లగన్నేరు ఆకుల నుంచి తీసిన రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

నెలసరి సమస్యలు: సాధారణంగా మహిళలు నెలసరి సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం ఐదు బిల్లగన్నేరు ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. మరిగిన ఈ నీటిని తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

దద్దుర్లు, దురద: పురుగులు, కీటకాలు కుట్టిన చోట దద్దుర్లు, దురద పెడుతుంటే.. ఆ ప్రాంతంలో బిళ్ళ గన్నేరు ఆకుల రసం అప్లై చేస్తే.. వెంటనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.. నొప్పి, మంట, వాపులు తగ్గుతాయి.

మానసిక సమస్య: మానసిక ఒత్తిడి, ఆందోళన తో డిప్రెషన్ లో ఉండి నిద్ర పట్టకుంటే.. ఈ మొక్క ఆకులను రసాన్ని రోజూ తీసుకొంటే.. మానసిక సమస్య తగ్గి.. నిద్ర చక్కగా పడుతుంది.

గమనిక: ఈ వ్యాసంలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇచ్చినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సలహాను పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.