Health News: బరువు తగ్గడానికి చాలా మంది డైటింగ్ చేస్తుంటారు. డైటింగ్ చేస్తే బరువు తగ్గుతారని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే తక్కువగా ఆహారం తీసుకుంటూ డైటింగ్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఎంతమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉపవాసాలు చేయడం, తక్కువగా కార్బో డైట్ చేయడం వంటివి.. శరీరంలోని కేలరీలను తగ్గించడమే కాకుండా.. దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సైన్స్ కారణాలను కూడా పేర్కోన్నారు.
ఎముకలు బలహీనత..
తక్కువగా తినడం వలన శరీరంలోని బలాన్ని కోల్పోతారని.. దీనివల అలసట, బలహీనతగా ఉంటారు. అన్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ స్టడీలో ఈ విషయాలు వెలువడ్డాయి. తక్కువగా ఆహారం తినడం వలన శరీరం అలసటకు గురవుతుంది. అలాగే ఎక్కువగా కోపం రావడం జరుగుతుంది. పిండి పదార్థాలను పూర్తిగా తినకుండా ఉండకూడదు.
దీర్ఘకాలిక బలహీనత..
తక్కువగా ఆహారం తీసుకోవడం వలన శరీరం ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ సమస్య దీర్ఘకాలం ఉంటుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారిలో తలనొప్పి, బద్ధకం, కోపం, మలబద్ధకం వంటి సమస్యల భారీన పడతారు. సాధ్యమైనంతవరకు ఎక్కవగా ఉపవాసాలు ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
జుట్టు రాలడం సమస్య..
బరువు తగ్గడానికి తక్కువగా ఆహారం తీసుకునేవారిలో ఎక్కువగా జుట్టు రాలడం జరుగుతందని నిపుణులు సూచిస్తున్నారు. డెర్మటాలజీ ప్రాక్టికల్ & కాన్సెప్చువల్ జర్నల్లో ప్రచురించిన దాని ప్రకారం ఓ అధ్యయనంలో సరైన పోషకాహారం లేకపోవడం వలన జుట్టు బలహీనమవుతుందని.. అలాగే కొత్త జుట్టు రావడం జరగదని పేర్కోంది. సరైన పోషకారహారం లేకపోవడం వలన జుట్టు పెరగడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:
జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయా ? అధ్యయనాల్లో బయటపడ్డ విషయాలెంటీ ?