Drink For Stomach Pain
ప్రస్తుతం మనం అవలంభిస్తున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగానే పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడవలసి వస్తుంది. ఉద్యోగ బాధ్యతలు, దైనందిత బాధ్యతల కారణంగా సమయపాలన లేని ఆహారం, వ్యాయామం చేయకపోవడం వంటి పలు ఆంశాలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంకా ఈ మధ్యకాలంలో చాలామంది ఆయిల్ పుడ్, జంక్ పుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇటువంటి చెడు ఆహారపు అలవాట్లు కారణంగా మీరు ఉదర సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లో తయారు చేసిన కొన్ని రకాల డ్రింక్స్ లేదా పానీయాలు తీసుకుంటే చాలని ఆరోగ్య, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తాగడం వల్ల క్షణాల్లోనే మీ కడుపు నొప్పి మాయం అవుతుందని వారు పేర్కొంటున్నారు. మరి ఆ డ్రింక్స్ ఏమిటనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
- ఉదర సంబంధిత సమస్యలను నయం చేయడంలో పెరుగు చాలా మేలు చేస్తుంది. ఒక కప్పు పెరుగులో జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్ వేసి .. రెండింటినీ బాగా కలిపి తాగాలి. ఆ తర్వాత దానిని తాగడం వల్ల కడుపు సమస్యలు దూరమవుతాయి.
- కడుపు సమస్యలను చెక్ పెట్టడంలో సోంపు టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం ద్వారా కడుపులో మంటను పూర్తిగా ఇంకా తక్షణమే నివారించవచ్చు. మరిగించిన నీటిలో చెంచా ఫెన్నెల్(సోంపు), రెండు స్పూన్ల తులసి ఆకులు వేసి బాగా వేడిచేసి తర్వాత వడకట్టి తాగాలి. ఇలా తాగడం ద్వారా కూడా తక్షణ ఉపశమనం లభిస్తుంది.
- వాము నీరు తాగడం వల్ల కూడా ఉదర సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అందు కోసం వామును నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మీకు మంచి రిలీప్ లభిస్తుంది.
- నిమ్మరసం తాగడం వల్ల కూడా కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- కడుపునొప్పి వచ్చినప్పుడు ఇంగువ నీటిని తాగాలి. అర చెంచా ఇంగువను నీటిలో కరిగించి తాగడం వల్ల పొట్ట సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..