ప్రతి రోజూ ఉదయం 20 నిమిషాలు ఇలా చేస్తే చాలు..! ఏ జబ్బు మీ దగ్గరికి రాదు..!

ఉదయం ఎండలో ఒక 20 నిమిషాలు గడిపితే మన బాడీకి, మైండ్‌కి అదిరిపోయే ట్రీట్‌మెంట్ దొరుకుతుంది. ఇది విటమిన్ డికి నాచురల్ సోర్స్‌గా పని చేస్తూ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంతే కాకుండా మన ఎనర్జీ లెవెల్స్ కూడా పీక్స్‌కి వెళ్తాయి.

ప్రతి రోజూ ఉదయం 20 నిమిషాలు ఇలా చేస్తే చాలు..! ఏ జబ్బు మీ దగ్గరికి రాదు..!
Vitamin D Benefits

Updated on: Aug 09, 2025 | 10:16 PM

ప్రతి రోజు ఉదయం 20 నిమిషాలు ఎండలో నిలబడి సూర్యకాంతిని ఆస్వాదించడం వల్ల మన శరీరానికి అద్భుతమైన ఆరోగ్య లాభాలు కలుగుతాయి. ఇది మన బాడీకి పవర్ హౌస్ లాగా పనిచేస్తుంది. మైండ్ ఫుల్నెస్‌కి కూడా హెల్ప్ చేస్తుంది. స్నానం చేయడం మస్ట్ అండ్ షుడ్ అయితే.. సూర్యకాంతిలో కొంత సమయం గడపడం కూడా అంతే ఇంపార్టెంట్. దీని వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్ డి నాచురల్‌గా లభిస్తుంది.

ఎనర్జీ బూస్టర్

కొన్ని నిమిషాలు నేచర్ వాతావరణంలో గడిపితేనే మన శరీరం బూస్ట్‌ప్యాక్ లాగా పని చేస్తుంది. రీసెర్చ్ ప్రకారం.. ఇలా చేయడం వల్ల ఎనర్జీ లెవెల్స్ 90 శాతం వరకు పెరుగుతాయని తెలిసింది. సూర్యకాంతి మన బాడీలోని సెల్స్‌ని యాక్టివ్‌గా ఉంచుతుంది.

సెరోటోనిన్ హార్మోన్

ఉదయం ఫ్రెష్ ఎయిర్ లో ఉండడం వల్ల మన బ్రెయిన్‌లో సెరోటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇది మనసుకు హ్యాపీనెస్, రిలాక్సేషన్ ఇచ్చే హార్మోన్. అలసట లేదా స్ట్రెస్ ఫీలింగ్స్ తగ్గించడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది.

ఇమ్యూనిటీ బూస్ట్

సూర్యరశ్మి వల్ల మన స్కిన్ విటమిన్ డిని ఆటోమెటిక్‌గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్‌ని స్ట్రాంగ్‌గా చేస్తుంది. తరచూ జబ్బు పడేవాళ్ళు డైలీ కొద్దిసేపు ఎండలో గడిపితే వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది.

షుగర్‌కి చెక్

మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్లో విటమిన్ డి కీ రోల్ పోషిస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు రోజు తెల్లవారుజామున కొద్దిసేపు సూర్యకాంతిలో గడిపితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌ లో ఉండటానికి హెల్ప్ అవుతుంది.

నిద్రలేమి సమస్యకి..

ఉదయం ఒక 20 నిమిషాలు ఎండలో గడపడం వల్ల నిద్రలేమి సమస్యకి గుడ్‌బై చెప్పొచ్చు. ఇది మన బాడీలోని నిద్ర హార్మోన్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. దీని వల్ల మంచిగా నిద్రపడుతుంది. విటమిన్ డి డెఫిషియెన్సీ ఉన్నవాళ్ళకి యూజువల్‌గా నిద్రలేమి ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)