Rubbing Nails: కేవలం 5 నిమిషాలు.. గోళ్లపై గడిపే ఈ కొద్ది సమయం మీ జీవితాన్ని మార్చేస్తుంది.. ఎలానో తెలిస్తే షాకవుతారు..

Rubbing Nails Yoga: గోళ్లను రుద్దడం ద్వారా జుట్టు పెరుగుదలను మెరుగుపరచడమే కాదు. ఇందుకు బదులుగా.. మీ శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తుంది. గోళ్లను రుద్దడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

Rubbing Nails: కేవలం 5 నిమిషాలు.. గోళ్లపై గడిపే ఈ కొద్ది సమయం మీ జీవితాన్ని మార్చేస్తుంది.. ఎలానో తెలిస్తే షాకవుతారు..
Rubbing Nails

Updated on: Sep 20, 2022 | 9:35 PM

యోగా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలా మందికి ఈ సంగతి.. కానీ సమయాభావం కారణంగా యోగా చేయడం మానేస్తుంటాం. అయితే సమయం అవసరం లేని ఇలాంటి యోగాలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఈ యోగాలను ఎప్పుడైనా.. ఎక్కడైనా చేయవచ్చు. అలాంటి యోగాలలో ఒకటి గోళ్లను రుద్దడం. అవును, గోళ్లు రుద్దడం కూడా ఒక యోగా ప్రక్రియనే. ఈ యోగా సాధన వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీ గోళ్లను రుద్దడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. అయితే గోళ్లు రుద్దడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసకుందాం.. 

జుట్టు రాలడం తగ్గుతుంది..

గోళ్లను క్రమం తప్పకుండా రుద్దడం వల్ల శరీరంలో డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని నియంత్రించవచ్చు. ఇది మంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే, నిర్జీవమైన జుట్టును వదిలించుకోవచ్చు. అంతే కాదు రెగ్యులర్ గా గోళ్లను రుద్దడం వల్ల తెల్లజుట్టు, బట్టతల, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. 

ఒత్తిడిని దూరం చేస్తుంది..

గోళ్లను కలిపి రుద్దడం వల్ల రిఫ్లెక్సాలజీ రిఫ్లెక్స్ ప్రాంతంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడితో, మీరు శరీరంలో నొప్పి,  ఒత్తిడిని తగ్గించవచ్చు. అదనంగా.. ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. 

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..

గోళ్లను రుద్దడం వల్ల మన శరీరంలోని అనేక అవయవాలకు ఉపశమనం లభిస్తుంది. అలాగే, ఇది రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో మీకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ యోగా చేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం