
ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అయితే ఇది అందరికి సరిపోదు. కొంతమందికి ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే తలనొప్పి, అలసటగా అనిపించడం, చక్కెర స్థాయి పడిపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు లేదా తక్కువ బీపీ ఉన్నవారు ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు వాకింగ్ చాలా మందికి ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా 10 నుండి 15 నిమిషాల వాకింగ్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో ఇది బాగా సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి అలవాటు.
ఒక విషయం గమనించాలి.. తిన్న వెంటనే తీవ్రమైన వ్యాయామాలు చేయడం మంచిది కాదు. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగించి అసౌకర్యానికి దారి తీస్తుంది. కాబట్టి తిన్న తర్వాత చేసే వాకింగ్ మితంగా, లైట్‌గా ఉండాలి.
మీ ఆరోగ్య లక్ష్యాలను బట్టి మీరు ఎంచుకునే వాకింగ్ సమయం మారుతుంది. మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటే ఖాళీ కడుపుతో ఉదయాన్నే వాకింగ్ చేయడం ఉత్తమం. మెటాబాలిజాన్ని పెంచడంలో ఇది ఉపయోగపడుతుంది.
మీరు జీర్ణక్రియ మెరుగవ్వాలని కోరుకుంటే లేదా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించాలంటే భోజనం తర్వాత వాకింగ్ చేయడం మంచిది. అయితే ప్రతి ఒక్కరి శరీర పరిస్థితి వేరు. మీరు ఎలాంటి శారీరక పరిస్థితుల్లో ఉన్నారో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఏ విధమైన వాకింగ్ చేసినా అది మితంగా ఉండాలి. అధిక ఒత్తిడితో చేసే వాకింగ్ శరీరానికి మేలు చేసే బదులుగా నష్టం కలిగించవచ్చు.
వాకింగ్ అనేది అందరికీ సరిపోయే ఆరోగ్యకరమైన అలవాటు. దాన్ని ఖాళీ కడుపుతో చేయాలా..? లేక తిన్న తర్వాతనా..? అనే విషయం మీద స్పష్టత పొందాలంటే.. ముందుగా మీ ఆరోగ్య అవసరాలను అర్థం చేసుకోవాలి. బరువు తగ్గాలంటే ఖాళీ కడుపుతో ఉదయం వాకింగ్ చేయడం ఉత్తమం. జీర్ణక్రియ, షుగర్ నియంత్రణ ముఖ్యం అయితే భోజనం తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిది.
ఎంచుకున్న పద్ధతి ఏదైనా సరే దాన్ని క్రమం తప్పకుండా చేస్తేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శరీరం ఎలా స్పందిస్తుందో గమనిస్తూ, మితంగా, సమయానికి వాకింగ్ చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)