Men Health: ఈ చిన్న అలవాట్లు మగవారిలో ఆ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి.. వివరాలివే..

|

Apr 04, 2023 | 9:59 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య ఎక్కువైపోయింది. దీనికి కారణం.. సరికాని జీవనశైలి, చెడు ఆహారం తినడం, స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించే అనేక ఇతర అలవాట్లు కూడా ఉన్నాయి.

Men Health: ఈ చిన్న అలవాట్లు మగవారిలో ఆ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి.. వివరాలివే..
Men Health
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య ఎక్కువైపోయింది. దీనికి కారణం.. సరికాని జీవనశైలి, చెడు ఆహారం తినడం, స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించే అనేక ఇతర అలవాట్లు కూడా ఉన్నాయి. అనేక పరిశోధనల ప్రకారం.. 23, 25 సంవత్సరాల వయస్సు నుండి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వంధ్యత్వ సమస్య మహిళలు, బాలికలకు కూడా సంభవించవచ్చు. అందుకే నేటి కాలంలో స్త్రీ అయినా, పురుషుడైనా అందరూ తమ ఆరోగ్యం పట్ల సరైన చర్యలు తీసుకుంటూనే ఉండాలి. స్పెర్మ్ కౌంట్, నాణ్యతను పెంచడానికి అవలంబించగల కొన్ని చిన్న అలవాట్లను ఇక్కడ ఉన్నాయి. వాటిని అనుసరించడం వలన సంతాన లేమి సమస్య నుంచి బయటపడొచ్చు.

ఈ అలవాట్లను పాటించాలి..

ఎక్కువ నీరు తాగడం: బిజీ లైఫ్‌లో వ్యక్తులు చేసే అతి పెద్ద తప్పు నీరు సరిగ్గా తాగకపోవడం. తక్కువ నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దాని ప్రభావం సంతానలేమి రూపంలో కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి.

ఆల్కహాల్, సిగరెట్‌కు దూరంగా ఉండాలి: ఆల్కాహాల్, సిగరెట్‌లు ప్రాణాపాయ పరిస్థితులను కలిగిస్తాయి. ఈ విషయం తెలిసినప్పటికీ చాలా మంది పురుషులు దీనికి బానిసలవుతారు. అయితే, ఈ దురలవాట్లు పురుషుల స్పెర్మ్ కౌంట్, నాణ్యతను కూడా తగ్గిస్తాయి. అందుకే ఈ అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

యోగా, ఫిజికల్ యాక్టివిటీ: చాలా మంది పురుషులు డెస్క్ జాబ్‌లు చేస్తారు. బిజీ షెడ్యూల్ ఉంటుంది. అయితే, ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజులో కనీసం 30 నిమిషాలు శారీరక శ్రమ కోసం వెచ్చించాలి. ఇలా చేయడం వలన సంతానోత్పత్తి స్థాయిని పెంచుకోవడమే కాకుండా, గుండె, ఇతర అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. స్పెర్మ్ కౌంట్ పెరగడంతో పాటు, నాణ్యత కూడా పెరుగుతుంది.

డ్రై ఫ్రూట్స్, రొటీన్: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో పోషకాహార లోపం కారణంగా, స్పెర్మ్ కౌంట్ స్థాయి పడిపోతుంది. రోజూ కనీసం రెండు బాదంపప్పులు, ఒక వాల్‌నట్‌, రెండు అంజీర పండ్లు, మూడు నుంచి నాలుగు ఎండుద్రాక్షలను నానబెట్టి తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే తేడాను గమనించొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..