ఈ చిన్న పనులు చేస్తే 50 ఏళ్ల తర్వాత కూడా మీ బుర్ర షార్ప్‌గా ఉంటుంది..!

వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సులభమైన దినచర్యలు పాటించడం ద్వారా మెదడును చురుకుగా ఉంచుకోవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడం, ధ్యానం చేయడం, వ్యాయామం, బ్రెయిన్ గేమ్స్ వంటి అలవాట్లు మెదడుకు శక్తినిస్తాయి. ఇవి మతిమరుపును నివారించడంలో సహాయపడతాయి.

ఈ చిన్న పనులు చేస్తే 50 ఏళ్ల తర్వాత కూడా మీ బుర్ర షార్ప్‌గా ఉంటుంది..!
Healthy Brain

Updated on: May 01, 2025 | 3:42 PM

వయసు పెరిగేకొద్దీ మెదడు పనితీరు తక్కువవుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మతిమరుపు కూడా రావచ్చు. కానీ కొన్ని చిన్న చర్యలతో మెదడును చురుగ్గా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత ఈ అలవాట్లు పాటిస్తే మెదడు బాగా పని చేస్తుంది. ప్రతి రోజు కొత్తగా ఏదైనా నేర్చుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండటం వల్ల మతిమరుపు రాదు. మెదడు పని చేయడంలో చొరవ చూపుతుంది. ఇది దైనందిన జీవితంలో శక్తిని ఇస్తుంది.

మెదడు బలంగా ఉండాలంటే బ్రెయిన్ గేమ్స్ ఆడడం మంచిది. చెస్, పజిల్స్ వంటివి మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. ఇవి ఆలోచనా శక్తిని పెంచుతాయి. ఈ గేమ్స్ ఆడటం సరదాగా ఉంటుంది. శారీరకంగా అలసిపోకుండా మెదడును తక్కువ సమయంతో పనిచేయించే అవకాశం ఇస్తాయి.

ప్రతి రోజు కాసేపు ధ్యానం చేస్తే మెదడుకు చాలా ఉపయోగకరం. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. శ్రద్ధ పెరుగుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. చిన్నప్పటి విషయాలు కూడా గుర్తుకువస్తాయి.

రక్త ప్రవాహం మెరుగుపడాలంటే వ్యాయామం అవసరం. ప్రతి రోజు వాకింగ్ చేయడం, స్విమ్మింగ్ చేయడం, యోగా చేయడం మెదడుకు బలాన్నిస్తుంది. ఇది శరీరం మొత్తానికి కూడా మంచిది. మెదడు బాగా పని చేస్తుంది. దాని పనితీరు నిలకడగా ఉంటుంది.

మీరెప్పుడూ ఉపయోగించే చేతికి బదులుగా రెండో చేతితో కొన్ని పనులు చేయాలి. ఉదాహరణకు బ్రష్ చేయడం లాంటి చిన్న పనులే అయినా మెదడుకు కొత్త అనుభవాలు ఇస్తాయి. ఇది సరదాగా అనిపిస్తుంది కానీ మెదడుపై మంచి ప్రభావం చూపుతుంది.

మనుషులతో ప్రత్యక్షంగా మాట్లాడటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది. మనసు సంతోషంగా ఉంటుంది. ఇలా రోజు మాట్లాడటం అలవాటు చేసుకుంటే మానసిక సమస్యలు తగ్గుతాయి.

ప్రతిరోజు ఏదో ఒక విషయం రాయడం మెదడుకు చాలా మంచిది. జర్నలింగ్ కూడా ఒక మంచి అలవాటు. చిన్న చిన్న విషయాలను కూడా క్రమం తప్పకుండా రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.

పుస్తకం చదవడం, వార్తాపత్రిక చూడటం వల్ల మెదడుపై మంచి ప్రభావం ఉంటుంది. ఇది జ్ఞానాన్ని పెంచుతుంది. 50 ఏళ్ల వయసులో కూడా చదవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల మతిమరుపు తగ్గుతుంది.

మీరు ఇలా రోజూ కొన్ని చిన్న అలవాట్లను అభ్యసించండి. ఎప్పటికీ మీ మెదడు చురుకుగా పని చేస్తుంది. ఆరోగ్యంగా జీవించడంలో ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది.