
Raw Eggs Side Effects
ఫిట్‌నెస్ ప్రియులు, బాడీబిల్డర్స్ ఎక్కువగా ప్రోటీన్ షేక్స్ లేదా స్మూతీల్లో పచ్చి గుడ్లను కలిపి తాగుతారు. కొంతమందికి పచ్చి గుడ్లలోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని ఒక నమ్మకం. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం ఇది చాలా డేంజర్ అని గట్టిగా హెచ్చరిస్తున్నారు.
పచ్చి గుడ్ల వల్ల లాభాలు (అంతంత మాత్రమే)
- గుడ్లలో ఉండే హై క్వాలిటీ ప్రోటీన్, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఎనర్జీని, కండరాల పెరుగుదలని, స్కిన్ హెయిర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతారు.
- కొన్ని స్టడీస్ ప్రకారం.. తక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు, ఇమ్యూనిటీకి మంచిదని అంటారు. కానీ దీనికి సైంటిఫిక్ ప్రూఫ్స్ తక్కువే.
- కొన్ని పోషకాలు ఉడికించినప్పుడు నశిస్తాయని.. అందుకే పచ్చి గుడ్లు తినడం మంచిదన్న అభిప్రాయం ఉంది.
పచ్చి గుడ్ల వల్ల కలిగే ప్రమాదాలు (అసలు నిజం)
- సాల్మొనెల్లా బ్యాక్టీరియా (Salmonella Bacteria).. పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండే ఛాన్స్ ఎక్కువ. దీని వల్ల వాంతులు, జ్వరం, విరేచనాలు, కడుపు నొప్పి, నీరసం లాంటి లక్షణాలు వస్తాయి. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లకి ఇది చాలా సీరియస్ ప్రాబ్లమ్ అవుతుంది.
- బయోటిన్ లోపం.. పచ్చి గుడ్లలో ఉండే అవిడిన్ అనే ప్రోటీన్, బయోటిన్ (విటమిన్ B7) బాడీకి అందకుండా అడ్డుకుంటుంది. పచ్చి గుడ్లు తినడం వల్ల జుట్టు రాలడం, స్కిన్ ప్రాబ్లమ్స్, నర్వ్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లు (ఉదాహరణకు క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నవాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులున్నవాళ్లు) పచ్చి గుడ్లు తింటే చాలా డేంజర్ అంటున్నారు వైద్య నిపుణులు.
- కొలెస్ట్రాల్ భయం.. పచ్చి గుడ్లు మరీ ఎక్కువ తింటే కొలెస్ట్రాల్, కొవ్వు లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. దీనిపై ఇంకా ఎక్కువ రీసెర్చ్ జరగాలి.
- నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. గుడ్లను ఉడికించి తినడమే ఉత్తమం. ఇలా చేయడం వల్ల హానికరమైన బ్యాక్టీరియాలను పూర్తిగా తొలగించవచ్చు. అంతేకాదు గుడ్లలోని ప్రోటీన్లు శరీరానికి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే ఉడికించిన గుడ్ల పోషక విలువ కూడా ఎక్కువగా ఉంటుంది.
అయినప్పటికీ మీరు పచ్చి గుడ్లు తినాలని అనుకుంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. తాజా గుడ్లను మాత్రమే ఎంచుకోండి. అలాగే తక్కువ పరిమాణంలో మాత్రమే తినండి, ఎందుకంటే రోజూ ఎక్కువ సంఖ్యలో తినడం వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. ఏదైనా సందేహం ఉంటే వైద్యుడిని లేదా డైటీషియన్‌ని సంప్రదించి వారి సలహా తీసుకున్న తర్వాతే పచ్చి గుడ్లను తినడం ప్రారంభించండి.
పచ్చి గుడ్లలో కొన్ని మంచి పోషకాలు ఉన్నా.. సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రమాదం, బయోటిన్ లోపం, కొలెస్ట్రాల్ సమస్యల వల్ల చాలా మందికి ఇవి సేఫ్ కాకపోవచ్చు. అందుకే ఉడికించిన గుడ్లను తినడం ద్వారా హెల్త్‌కి మేలు, సేఫ్టీ, ఈజీ డైజేషన్ అన్నీ దొరుకుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)