Ayurvedic Herb Brahmi: పిల్లల్లో తెలివి తేటలు , జ్ఞాపక శక్తి పెరగాలన్నా మన పెద్దలు బ్రహ్మి ఆకుని ఉపయోగించేవారు. దీనిని వాడుక భాషలో సరస్వతి ఆకు అని అంటాం.. ఇది గొప్ప ఆయుర్వేద ఔషధ మూలిక.. ఈ ఆకు పొడిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వలన అద్భుత ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆలోచనా శక్తి పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ప్రస్తుతం అన్ని ఆయుర్వేద షాపుల్లో ఇది పొడి, టాబ్లెట్స్, లేహ్యం, తైలం. ఇలా నేక రూపాల్లో లభిస్తుంది. ఈ బ్రహ్మి ఆకు చిన్న మెదడుకు ఆధారమైన సెరెబెల్లమ్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఆకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం
*ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య మానసిక ఒత్తిడి. దీనికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒత్తిడి ప్రతిస్పందనతో సంబంధం ఉన్న హార్మోన్లను నియంత్రింస్తుంది, దీంతో మానసిక ప్రశాంతతను చేకూర్చుతుంది.
* అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను తగ్గించడానికి ఇది దివ్య ఔషధం
*మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్రహ్మి ఆకుల్లో బాకోసైడ్లు అని పిలువబడే బయో కెమికల్ ఉంటాయి. ఇవి మెదడు కణాలను ప్రభావితం చేస్తాయి.. దీంతో మెదడు కణజాలాలను తిరిగి నిర్మించడంలో సహాయపడుతుంది.
*ఇది తెలివితేటలు, ఏకాగ్రత , జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడులోని హిప్పోకాంపస్ భాగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఏకాగ్రత , జ్ఞాపకశక్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
*ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లతో ఇది నిండి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కాన్సర్ ను అభివృద్ధి చేసే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
*ఆర్థరైటిస్, గౌట్, ఇతర తాపజనక పరిస్థితుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
*గ్యాస్ట్రిక్ అల్సర్లను తగ్గించడానికి, ప్రేగు సిండ్రోమ్ చికిత్సకు అత్యంత ఉపయోగపడే ఔషధం
*షుగర్ వ్యాధి గ్రస్థులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
* జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయ పడుతుంది.
*సరస్వతి తైలం చర్మ కణాల పునరుత్పత్తిని ప్రేరేపించడం ద్వారా చర్మం రంగును పెంచుతాయి.
Also Read: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించేందుకు .. ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి