పండ్లు, కందమూలాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరంగా చెప్పుకోవచ్చు. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రుణధాన్యాలను ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.
అయితే క్యారెట్లలో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్-ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుందనే సంగతి మీకు తెలుసా? అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం…
క్యారెట్ వల్ల ఆరోగ్యానికి లభించే ప్రయోజనాలు గురించి మీకు తెలిసిందే. అయితే క్యారెట్ ఆరోగ్యం కోసం మాత్రమే కాదు. అందాన్ని కూడా పెంచుతుంది. శరీరానికి శక్తిని అందించినట్లే.. సౌందర్య సాధనంగా కూడా క్యారెట్ ఉపయోగపడుతుంది. క్యారెట్లో బీటా కెరోటిన్లూ, విటమిన్-A, విటమిన్-C, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి. మీ ముఖ వర్చస్సు మెరవాలంటే తప్పకా ఇలా చేయండి…