Heart Attack With PCOD: మహిళల్లో గుండెపోటుకు కారణమవుతున్న PCOD.. దీనితో జాగ్రత్తగా ఉండాలంటోన్న నిపుణులు

|

Oct 07, 2024 | 12:31 PM

గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పురుషులలో ఎక్కువగా ఉంటుందని సాధారణంగా అంతా అనుకుంటారు. కానీ పీరియడ్స్ సక్రమంగా లేకపోవడం వల్ల, మహిళల్లో కూడా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతోందనే విషయం చాలా మందికి తెలియదు. అవును.. PCOD, ఊబకాయం, గాలి కాలుష్యం వంటి వాటి వల్ల మహిళల్లో గుండె జబ్బులు పెరుగుతున్నాయి..

Heart Attack With PCOD: మహిళల్లో గుండెపోటుకు కారణమవుతున్న PCOD.. దీనితో జాగ్రత్తగా ఉండాలంటోన్న నిపుణులు
Heart Attack With PCOD
Follow us on

గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పురుషులలో ఎక్కువగా ఉంటుందని సాధారణంగా అంతా అనుకుంటారు. కానీ పీరియడ్స్ సక్రమంగా లేకపోవడం వల్ల, మహిళల్లో కూడా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతోందనే విషయం చాలా మందికి తెలియదు. అవును.. PCOD, ఊబకాయం, గాలి కాలుష్యం వంటి వాటి వల్ల మహిళల్లో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో మహిళల్లో గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరగడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ’ ప్రకారం.. భారతీయ మహిళల్లో మరణానికి ప్రధాన కారణం గుండె సంబంధిత వ్యాధులు, 17 శాతం కంటే ఎక్కువ మరణాలు ఈ కారణంగానే సంభవిస్తున్నట్లు వెల్లడించింది.

PCOD అంటే ఏమిటి?

పిసిఒడి అనేది జీవనశైలి వ్యాధి. అనారోగ్యకరమైన జీవనశైలి, అధికంగా జంక్ ఫుడ్ తినడం, తక్కువ నిద్ర, ఒత్తిడి, ఊబకాయం వంటి అనేక కారణాల వల్ల మహిళల్లో పీరియడ్స్ క్రమం తప్పుతున్నాయి. ఈ కారణాలు వీరిలో గుండెపోటుకు కారణమవుతున్నాయి. నేటి కాలంలో మహిళల్లో కనిపించే అత్యంత సాధారణ సమస్యగా PCOD ఉద్భవిస్తోంది. ఇందులో బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం, ఆండ్రోజెన్‌లు అధికంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువ. అలాగే, పిసిఒడి రక్తనాళాలు గుండెపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

నిపుణులు ఏమంటారు?

సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వరుణ్ బన్సాల్ మాట్లాడుతూ.. అండాశయాల నుంచి ఈస్ట్రోజెన్ హార్మోన్ మహిళల హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అయితే నేటి కాలంలో మహిళల్లో స్థూలకాయం సమస్య చాలా ఎక్కువైంది. పిసిఒడి పెరిగిపోయింది. వాయుకాలుష్యం కారణంగా ధూమపానం అలవాటు లేనప్పటికీ ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావిత మవుతున్నాయి. ఈ కారణాల రిత్య మహిలల్లో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గుండె సమస్యలున్న వారు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఇవేకాకుండా, అధిక రక్తపోటు, మధుమేహం, డైస్లిపిడెమియా వంటి ప్రమాద కారకాలు కూడా మహిళల్లో వేగంగా పెరుగుతున్నాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

PCODని నివారించే మార్గాలు

  • బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
  • రోజూ వ్యాయామం చేయడం.
  • ఒత్తిడి మేనేజ్‌ చేయడానికి యోగా లేదా ధ్యానం చేయడం
  • రోజూ 7 నుండి 8 గంటల పాటు తగినంత నిద్ర పోవడం
  • ధూమపానం, మద్యపానం మానుకోవడం

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.