Health Alert: టీతో బిస్కెట్లు తింటున్నారా? ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు వెల్‌కం చెబుతున్నట్టే

చాలా మంది బిస్కెట్లు హానికరం కావని, వాటిని హెల్తీ పుడ్ అని భావిస్తూ తినేస్తుంటారు. కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో బాధపడుతున్న వందలాది మంది రోగులను పరిశీలించిన ఒక ప్రముఖ డాక్టర్, బిస్కెట్లు ఒక 'బ్లడ్-గ్లూకోజ్ డెలివరీ సర్వీస్'లా పని చేస్తాయని హెచ్చరించారు.

Health Alert: టీతో బిస్కెట్లు తింటున్నారా? ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు వెల్‌కం చెబుతున్నట్టే
Tea Time Biscuits.jpg

Updated on: Mar 23, 2026 | 9:12 PM

మధుమేహం లేదా అధిక రక్త చక్కెర అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి స్వీట్లు, కూల్ డ్రింక్స్. కానీ, మనకు తెలియకుండానే మన మెటబాలిక్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అసలు శత్రువు మరొకటి ఉంది. అదే మనం ప్రతిరోజూ టీతో కలిపి తినే ‘బిస్కెట్’. లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సుమిత్ శర్మ తన తాజా పరిశోధనల ద్వారా ఈ షాకింగ్ నిజాలను వెల్లడించారు. బిస్కెట్లు ఎలా ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు దారితీస్తాయో, వాటి వల్ల కలిగే నష్టాలేంటో వివరంగా తెలుసుకుందాం.

బిస్కెట్లు ఎందుకు ప్రమాదకరం?

సాధారణ బిస్కెట్లలో ఉండే పదార్థాలు మీ మెటబాలిజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

  • రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ (మైదా)- ఇది శరీరంలో చాలా వేగంగా జీర్ణమై, గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది.
  • చక్కెర- రక్తంలోకి గ్లూకోజ్‌ను వెంటనే విడుదల చేస్తుంది.
  • వెజిటబుల్ ఆయిల్స్- ఇవి శరీరంలో వాపును కలిగిస్తాయి.
  • ఫైబర్, ప్రోటీన్ లేకపోవడం- బిస్కెట్లలో ఫైబర్, ప్రోటీన్ సున్నా. దీనివల్ల గ్లూకోజ్ గ్రహించే వేగాన్ని తగ్గించే ఆస్కారం ఉండదు, ఫలితంగా ఇన్సులిన్ ఒక్కసారిగా పెరిగిపోతుంది.

ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే..

శరీరంలోని కణాలు ఇన్సులిన్ హార్మోన్‌కు సరిగ్గా స్పందించకపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల క్లోమం మరింత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

  • విపరీతమైన అలసట, ‘బ్రెయిన్ ఫాగ్’.
  • పొత్తికడుపులో కొవ్వు పెరగడం, బరువు పెరగడం.
  • చివరకు టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.

టీతో రెండు బిస్కెట్లు తిన్న 20-30 నిమిషాల్లో రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఆ తర్వాత 60-90 నిమిషాలకు గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. దీనివల్ల మీకు మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ బిస్కెట్ల వైపు మొగ్గు చూపుతారు. ఇలా తెలియకుండానే మీరు రోజుకు 5-10 బిస్కెట్లు తినే ప్రమాదం ఉంది.

నిపుణుల సూచనలు

  1. బిస్కెట్లను మానేయండి- కనీసం 4 వారాల పాటు బిస్కెట్లు తినడం ఆపేయండి.
  2. ప్రోటీన్ స్నాక్స్- బిస్కెట్లకు బదులుగా 20-30 గ్రాముల ప్రోటీన్ ఉండే ఉడికించిన గుడ్లు, బాదం పప్పులు, పనీర్ లేదా గ్రీక్ యోగర్ట్ తీసుకోండి.
  3. స్వీట్ కావాలంటే- ఒక ముక్క డార్క్ చాక్లెట్ (85% కోకో) లేదా బెర్రీలు తినండి.
  4. విరామం ఇవ్వండి- భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి.

మధుమేహం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ప్రతిరోజూ మనం చేసే చిన్నపాటి పొరపాట్లే పెద్ద అనారోగ్యాలకు దారితీస్తాయి. టీతో బిస్కెట్లను పక్కన పెట్టి, ప్రోటీన్ రిచ్ ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా మీ మెటబాలిక్ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు.

Follow Us