Health Tips: నోటిలో గాయమైందా? ఏమీ తినలేకపోతున్నారా? ఈ టిప్స్‌తో గాయాన్ని నయం చేయండి..!

|

Sep 13, 2022 | 6:26 AM

Health Tips: అనేక సందర్భాల్లో ఆహారం, లేదా ఇతర పదార్థాలు తినేటప్పుడు నాలుక గానీ, లోపలి చర్మం గానీ దంతాల మధ్య చిక్కుకుని గాయమవుతుంది.

Health Tips: నోటిలో గాయమైందా? ఏమీ తినలేకపోతున్నారా? ఈ టిప్స్‌తో గాయాన్ని నయం చేయండి..!
Health Tips
Follow us on

Health Tips: అనేక సందర్భాల్లో ఆహారం, లేదా ఇతర పదార్థాలు తినేటప్పుడు నాలుక గానీ, లోపలి చర్మం గానీ దంతాల మధ్య చిక్కుకుని గాయమవుతుంది. దీంతో నోటిలోపల తీవ్రమైన నొప్పి వస్తుంది. తినడం, తాగడానికి మరింత ఇబ్బంది తలెత్తుతుంది. నోటి లోపల చర్మం, నాలుక కట్ అయినప్పుడు బాధిత వ్యక్తి ఆహారాన్ని నమలలేని పరిస్థితి ఉంటుంది. అయితే, ఈ గాయం తగ్గడానికి సమయం పట్టొచ్చు. కానీ, ఎంత త్వరగా చికిత్స చేస్తే అంత మంచిది. ఆహారం సరిగా నమలకపోతే కడుపులో సమస్యలు తలెత్తుతాయి. ఈ రకమైన నోటి గాయాన్ని తగ్గించడానికి కొన్ని హోమ్ రెమిడీస్, చిట్కాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

వేడి నీటి తీసుకోవడం..

నోటిలో గాయం త్వరగా నయం అవ్వాలంటే రోజుకు ఒకసారి గోరువెచ్చని నీరు తాగాలి. ఇదికాకుండా, వేడి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటిలో గాయం త్వరగా నయం అవడమే కాకుండా.. నోటి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. దంతాలు, నాలుకపై పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి

చల్లని పదార్థాలు..

నోట్లో గాయమైనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే, చాలా మంది దీనిని లైట్ తీసుకుంటారు. వేడి వేడి పదార్థాలు తింటుంటారు. దీని కారణంగా సమస్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అందుకని, కొన్ని రోజులపాటు.. చల్లగా ఉండే పదార్థాలను తినాలని సూచిస్తున్నారు నిపుణులు. దీని ప్రభావం నోటి గాయంపై చల్లగా ఉంటుంది. ఫలితంగా సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. పెరుగు అన్నం వంటి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

కలబంద..

నోటి గాయం విషయంలో అలోవెరా అద్భుతంగా పని చేస్తుంది. అలోవెరా జెల్‌ని ఉపయోగించడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని ఈ ఔషధ గుణాలు గాయాలను త్వరగా మాన్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా అలోవెరా జెల్‌ను నోటిలో గాయమైన ప్రదేశంలో అప్లై చేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మ గాయాలకు కూడా ఈ హోం రెమెడీని ప్రయత్నించవచ్చు.

(గమనిక: ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కథనాన్ని అందించడం జరిగింది. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. వైద్యులను సంప్రదించడం ఉత్తమం.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..