Kidney Failure: మూత్రంలో సమస్యతోపాటు ఈ లక్షణాలుంటే.. కిడ్నీ ఫెయిల్యూర్‌‌కు దారి తీసినట్లే..

|

Dec 28, 2021 | 8:59 AM

Kidney Diseases: మూత్రంలో సమస్యలుంటే చాలామంది ఏం కాదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అయితే.. మూత్రంలో సమస్యలు ఉంటే.. ఇవి మూత్రపిండ వైఫల్యానికి పెద్ద సంకేతంగా పరిగణించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మూత్రపిండాల వైఫల్యానికి అనేక ఇతర సంకేతాలు ఉంటాయన్న విషయాన్ని గ్రహించాలి. ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ముఖం మీద వాపు: నిపుణుల అభిప్రాయం ప్రకారం మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, సోడియం పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ముఖం లేదా ఇతర ప్రదేశాలలో వాపు కనిపిస్తుంటుంది.

2 / 5
చర్మంపై దురద: చర్మంపై దురదను కూడా కిడ్నీ సంబంధిత సమస్యలకు సంకేతంగా పరిగణించవచ్చు. కిడ్నీలో టాక్సిన్ అధికంగా ఉండటం వల్ల చర్మ సమస్యలు, దురద, చర్మం పొడిబారిపోవడం కనిపిస్తుంది.

3 / 5
కండరాలలో తిమ్మిరి: మీ పాదాలు, వాటి కండరాల్లో తిమ్మిరి చిన్నపాటి నొప్పులు ఉంటే.. అది మూత్రపిండాల వైఫల్యం లేదా దాని బలహీనతకు సంకేతంగా పరిగణిస్తారు. దీనికి కారణం సోడియం, కాల్షియం మధ్య సమతుల్యత లేకపోవడంగా భావిస్తారు.

4 / 5
అలసట-నీరసం: శరీరంలో అలసట, నీరసం భావన ఉంటే.. ఇది మూత్రపిండాల వైఫల్యం లేదా దాని బలహీన లక్షణాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కిడ్నీ విష పదార్థాలను తొలగించలేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.

5 / 5
నిద్ర లేకపోవడం: నివేదికల ప్రకారం.. నిద్ర లేకపోవడం కూడా మూత్రపిండాల వైఫల్యానికి సంకేతంగా పరిగణిస్తారు. ఇది కిడ్నీపై తీవ్ర ఒత్తిడి కనిపిస్తుంది.