Health Tips: మన దేశంలో సెక్స్ అనేది పెద్ద బూతులా భావిస్తుంటారు చాలా మంది. కానీ పాశ్చాత్య దేశాల్లో సెక్స్ అనేది సాధారణ విషయం. ఇద్దరు భాగస్వాముల మధ్య మంచి సంబంధం నెలకొడంలో సెక్స్ పాత్ర అమితం అని చెప్పొచ్చు. సెక్స్ గురించి ప్రకటన చేయడం కంటే.. వ్యక్తీకరించడం సరైనదని నిపుణులు చెబుతుంటారు. భాగస్వామి ప్రేమను పొందడానికి సెక్స్ ఉత్తమమైన మార్గం అని కూడా చెబుతుంటారు.
అయితే, సెక్స్ డ్రైవ్ లేదా లిబిడో అనేది లైంగిక అనుభవానికి సంబంధించింది. ప్రస్తుత కాలంలో చాలామంది స్త్రీలు, పురుషుల్లో సెక్స్ పట్ల ఆసక్తి క్రమంగా సన్నగిల్లిపోతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నారు. ఇలా లైంగిక పరమైన కోరికలు తగ్గడానికి అనేక అంతర్గత, బాహ్య కారకాలు కారణాలుగా పేర్కొన్నారు. అన్నికంటే ముఖ్యంగా.. మాదకద్రవ్యాలు, మెడిసిన్స్ కారణం అవుతున్నాయని తాజాగా అధ్యయనంలో తేల్చారు. సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడానికి ప్రధానంగా 7 రకాల ఔషధాలు కారణమవుతాయని తాజా నివేదికలో పేర్కొన్నారు. ఆ 7 రకాల డ్రగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెయిన్ కిల్లర్స్: రిస్క్-ఫ్రీ పెయిన్ కిల్లర్స్.. మీ శరీరంలో నొప్పినే కాదు.. సెక్స్ డ్రైవ్ సామర్థ్యాన్ని చంపేస్తుందట. పురుషులు, స్త్రీలలో లైంగిక కోరికలను ప్రేరేపించే టెస్టోస్టెరాన్ సహా వివిధ రకాల హర్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందట.
యాంటీ-డిప్రెసెంట్స్: ఈ మందులు డిప్రెషన్ చికిత్సకు ఉపయోగిస్తారు. వీటిని లిబిడో కిల్లర్స్ అంటారు. వీటిని అతిగా వివినియోగించడం వలన సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోవడం, ఉద్వేగం ఆలస్యం, ఆలస్య స్ఖలనం, అస్సలు స్ఖలనం కాకపోవడం, అంగస్తంభన వంటి సమస్యలు తలెత్తుతాయి.
జనన నియంత్రణ మాత్రలు: స్త్రీలు గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడితే.. అవి లైంగిక కోరికను ప్రభావితం చేసే సెక్స్ హార్మోన్ల స్థాయిలను తగ్గించవచ్చు.
స్టాటిన్స్, ఫైబ్రేట్స్: ప్రధానంగా అధిక కొలెస్ట్రాల్ చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే, ఈ మందులు టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్, ఇతర సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిలో ప్రధానంగా జోక్యం చేసుకోవచ్చు. స్టాటిన్స్, ఫైబ్రేట్స్ అతి వాడకం.. అంగస్తంభనకు కారణం అవుతాయని అనేక నివేదికల్లో పేర్కొన్నారు.
బెంజోడియాజిపైన్స్-ట్రాంక్విలైజర్స్: బెంజోడియాజిపైన్స్ ని సాధారణంగా మత్తుమందులు అని పిలుస్తారు. ఆందోళన, నిద్రలేమి, కండరాల నొప్పుల చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. బెంజోడియాజిపైన్స్ లైంగిక ఆసక్తి, ఉద్రేకం, ఉత్సాహాన్ని ప్రభావితం చేస్తాయి. బలహీనమైన ఉద్వేగం, బాధాకరమైన సంభోగం, శీఘ్ర స్ఖలనం సమస్యలు, అంగస్తంభన వంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని కూడా అంతరాయం కలిగిస్తాయి.
రక్తపోటు మందులు: అధిక రక్తపోటుకు సంబంధించిన మెడిసిన్స్ ఎక్కువగా వినియోగించడం వలన లైంగిక సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగానే రక్తపోటు ఎక్కువగా ఉంటే.. లైంగిక పరమైన కోరికలు, సామర్థ్యం తగ్గుతుంది. అదే సమయంలో రక్తపోటును తగ్గించే మెడిసిన్స్ వినియోగం వల్ల ఆ కోరికలు ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. లైంగిక కోరికలు తగ్గడం, అంగస్తంభనలు, శీఘ్ర స్ఖలనం సమస్యలు తలెత్తుతాయని అధ్యయనంలో పేర్కొన్నారు నిపుణులు. ఇక స్త్రీలలో యోని పొడిబారడం, కోరికలు తగ్గడం, భావప్రాప్తి పొందడంలో ఇబ్బందులు కలిగిస్తుంది.
యాంటిహిస్టామైన్లు:ఎడతెగని తుమ్ములు, ముక్కు కారడం వంటి అలెర్జీ సంబంధిత లక్షణాలను నియంత్రించడానికి ఈ మెడిసిన్స్‌ను ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇవి పురుషులలో అంగస్తంభన లేదా స్ఖలన సమస్యలకు కారణం అవుతుంది. మహిళల్లో యోని పొడిబారే సమస్యలు తలెత్తుతాయి.