Sleeping Tips: మీరు బోర్లా పడుకుని నిద్రపోతున్నారా? దానివల్ల కలిగే నష్టాలివే..!

Sleeping Tips: ప్రతి ఒక్కరూ వారి స్వంత స్టైల్‌లో నిద్రోపోతుంటారు. కొంత మంది వెల్లకిలా, నిటారుగా నిద్రపోతారు, కొందరు ఒకవైపునకు తిరిగి పడుకుంటారు.

Sleeping Tips: మీరు బోర్లా పడుకుని నిద్రపోతున్నారా? దానివల్ల కలిగే నష్టాలివే..!
Sleeping On Stomach Positio

Updated on: Sep 12, 2022 | 6:10 AM

Sleeping Tips: ప్రతి ఒక్కరూ వారి స్వంత స్టైల్‌లో నిద్రోపోతుంటారు. కొంత మంది వెల్లకిలా, నిటారుగా నిద్రపోతారు, కొందరు ఒకవైపునకు తిరిగి పడుకుంటారు. మీరు నిద్రించే మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? బోర్లా పడుకోవద్దని ఇంట్లోని పెద్దలు చాలాసార్లు చెబుతుంటారు. ఇలా చెప్పడానికి కారణం ఆరోగ్య ప్రయోజనాలే. అవును, బోర్లా పడుకోవడంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

బోర్లా పడుకోవడం వలన కలిగే నష్టాలు..

వెన్నెముక ఒత్తిడి, శరీర నొప్పులు..

ఇవి కూడా చదవండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బోర్లా పడుకుని నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. దీని వల్ల శరీరం బరువు, ఒత్తిడి వెన్నెముకపై పడుతుంది. వెన్నుపాముపై ఒత్తిడి పెరిగి.. శరీరంలోని ఇతర భాగాలలో నొప్పులు వస్తాయి. అందుకే బోర్లా పడుకుని నిద్రపోవడం శరీరానికి మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

నొప్పి, జలదరింపు..

బోర్లా పడుకోవడం వలన శరీరం క్రియారహితంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి, జలదరింపు సమస్య ఏర్పడుతుంది. ఒక్కోసారి శరీరం మొద్దుబారిపోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. బోర్లా పడుకునే వారికి ముఖ్యంగా తరచుగా మెడ నొప్పి వస్తుంది.

గర్భిణీ స్త్రీలు..

గర్భిణీ స్త్రీలు అస్సలు బోర్లా పడుకోవద్దు. నిద్ర పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భధారణ సమయంలో మహిళ బోర్లా పడుకుంటే.. కడుపుపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అది పిల్లలపై ప్రభావం చూపుతుంది.

బోర్లా పడుకోవడం వలన కలిగే ప్రయోజనాలు..

ఇప్పటి వరకు బోర్లా పడుకోవడం వలన కలిగే నష్టాల గురించి చదివారు. ఇప్పుడు ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. బోర్లా పడుకోవడం వలన అనేక నష్టాలు ఉన్నట్లుగానే.. కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిద్రపోయేటప్పుడు గురక పెట్టే అలవాటు ఎవరికైనా ఉంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో బోర్లా నిద్రపోవడం వలన గురక సమస్య నుంచి బయటపడుతారు. శ్వాస తీసుకోవడం సులభమై.. గురక రాదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..