Nerves Health: నరాల బలహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ పండ్లు తింటే అద్భుత ప్రయోజనాలు..

|

Sep 13, 2022 | 6:33 AM

Nerves Health: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో అసంబద్ధమైన దినచర్య కారణంగా.. చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు.

Nerves Health: నరాల బలహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ పండ్లు తింటే అద్భుత ప్రయోజనాలు..
Weakness
Follow us on

Nerves Health: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో అసంబద్ధమైన దినచర్య కారణంగా.. చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. కాళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్ వంటి ఇతర అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వీటన్నింటికంటే ఎక్కువగా నరాల బలహీనతతో చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ నరాల బలహీనత కారణంగా రోజు గడవడమే కష్టంగా ఉంటుంది. ఏ పని చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అంతేకాదు.. అనేక వ్యాధులకు మార్గం వేస్తుంది. ఈ సమస్యను తొలగించుకోవాలంటే.. యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలిని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా నరాల బలహీనత తగ్గుతుందని, క్షీణిస్తున్న ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నారు. యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పండ్లలో ఫ్లేవనాయిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి నరాలవ్యాధిని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏ పండ్లు తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

దానిమ్మ..

ఐరన్ పుష్కలంగా ఉన్న దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు కూడా చాలా ఉన్నాయి. ఇవి నరాలకు బలాన్ని ఇస్తాయి. దానిమ్మ ఆరోగ్యకరమైన, రుచికరమైన పండు. ఇది సిరల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. సిరలను రిలాక్స్‌గా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

సి విటమిన్ అధికంగా ఉండే పండ్లు..

నారింజ, కివీస్ వంటి విటమిన్ సి ఆహారాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పండ్లు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, ఈ పండ్లు న్యూరోపతిక్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అటువంటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వలన శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది.

బెర్రీలు..

నరాలను దృఢంగా మార్చడంలో బెర్రీలు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య, ఆహార నిపుణులు అంటున్నారు. బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీలను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. బెర్రీలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తాయి. మిమ్మల్ని రిలాక్స్‌గా చేస్తాయి.

(గమనిక: ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దీనిని పబ్లిష్ చేయడం జరిగింది. TV9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ఏవైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ముఖ్యం.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..