Kidney Health: మీ శరీరంలో ఈ 3 లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే అలర్ట్ అవ్వండి.. లేదంటే కిడ్నీ దెబ్బతింటుంది..

|

Mar 18, 2023 | 1:34 PM

‘కిడ్నీ’ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది శరీరం నుండి విషపూరిత టాక్సిన్స్ తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజంతా మనం తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలు, అనారోగ్యకరమైన..

Kidney Health: మీ శరీరంలో ఈ 3 లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే అలర్ట్ అవ్వండి.. లేదంటే కిడ్నీ దెబ్బతింటుంది..
Kidney Care
Follow us on

‘కిడ్నీ’ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది శరీరం నుండి విషపూరిత టాక్సిన్స్ తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజంతా మనం తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలు, అనారోగ్యకరమైన పదార్థాలు రెండూ ఉంటాయి. అయితే, ఈ అనారోగ్యకరమైన పదార్థాల వల్ల శరీరంలోని ఇతర అవయవాలకు నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా కిడ్నీ అనారోగ్యానికి గురవుతుంటుంది. తద్వారా ఇతర అవయవాలు కూడా అనారోగ్యానికి గురవుతాయి. మరి కిడ్నీ అనారోగ్యానికి గురైందని ఎలా గుర్తించాలి? అందుకు సంబంధించి శరీరంలో ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపిస్తాయి? వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కిడ్నీ దెబ్బతింటే ప్రధానంగా 3 లక్షణాలు ముందే కనిపిస్తాయి. అవేంటంటే..

1. బరువు తగ్గడం

కిడ్నీ సరిగా పని చేయనప్పుడు శరీరంలో టాక్సిన్స్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. దీనివల్ల ఆకలిలో తేడా వస్తుంది. బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఆకలి వేయకపోవడం, ఉదయం వేళ వాంతులు రావడం వంటి సమస్యలు వస్తాయి. కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమీ తినాలని అనిపించదు. ఈ లక్షణాన్ని అస్సలు విస్మరించకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి.

2. పాదాల వాపు..

మూత్రపిండాల వైఫల్యంలో మరొక తీవ్రమైన లక్షణం ఉంది. శరీరంలోకి వచ్చే అదనపు సోడియంను తొలగించడంలో కిడ్నీ అద్భుతంగా పని చేస్తుంది. అయితే, కిడ్నీ పనిచేయడం ఆగిపోపతే.. శరీరంలో సోడియం పేరుకుపోతుంది. దీని కారణంగా.. పాదాలలో వాపు కనిపిస్తుంది. అలాగే, కళ్లు, ముఖం కూడా ఉబ్బుతుంది.

ఇవి కూడా చదవండి

3. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన..

మూత్రపిండాలు అనారోగ్యానికి గురయ్యాని గుర్తించడానికి మరో లక్షణం కూడా ఉంది. కిడ్నీ అనారోగ్యానికి గురైతే.. రాత్రిపూట మళ్లీ మళ్లీ మూత్ర విసర్జన వస్తుంది. సాధారణంగా మధుమేహ బాధితులకు తరచుగా మూత్రం వస్తుంటుంది. మధుమేహం సమస్య లేని వారు, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లయితే తరచుగా మూత్రం వస్తుంటుంది. అలాంటి సందర్భంలో వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, వైద్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..