NSDRతో కేవలం 4 గంటల్లోనే 8 గంటల నిద్ర మీ సొంతమంటోన్న గూగుల్ సీఈవో.. అసలేంటిది, ఎలా ఫాలో చేయాలంటే?

Google CEO Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఈ NSDR గురించే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తను కూడా ఇదే ఫాలో చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

NSDRతో కేవలం 4 గంటల్లోనే 8 గంటల నిద్ర మీ సొంతమంటోన్న గూగుల్ సీఈవో.. అసలేంటిది, ఎలా ఫాలో చేయాలంటే?
Sleeping
Follow us

|

Updated on: Mar 13, 2022 | 9:04 PM

8 Hours Sleep: పని ఒత్తిడి వల్ల సరైన నిద్ర పోలేకపోతున్నారా.. అయితే మీకోసమే ఈ రోజు ఓ హెల్త్ టిప్‌తో వచ్చాం. దీనితో కేవలం 4 గంటల్లో 8 గంటలు మంచి నిద్రను పొందవచ్చు. అవునండీ.. ఇది ఇప్పటికే చాలామంది ఫాలో అవుతోన్న చక్కని చిట్కా. దానినే ఎన్‌ఎస్‌డీఆర్(NSDR) అని కూడా పిలస్తుంటారు. ఎన్ఎస్‌డీఆర్ అంటే నిద్ర పోకుండా పూర్తి విశ్రాంతి(నాన్-స్లీప్ డీప్ రెస్ట్) అన్నమాట. అసలు NSDR అంటే ఏమిటి. దీనిని ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్(Google CEO) సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఈ NSDR గురించే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తను కూడా ఇదే ఫాలో చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఇది యోగ నిద్ర లాగా ఉంటుంది. అలాగు ఇదొక ఆధ్యాత్మిక నిద్ర కూడా. ఇందులో మెలకువగా ఉంటూనే నిద్రపోవడం సాధన చేయాలి. నిద్ర, మేల్కొలుపు మధ్య స్థితిని యోగా నిద్ర అంటారు. మన ఋషులు చేసేది ఇలాంటిదేనని నిపుణులు అంటున్నారు.

వీరితోపాటు విలుకాడు, పాండవుల్లో ఒకరైన అర్జునుడికి నిద్ర అవసరం లేదు. ఎందుకంటే యోగ నిద్రను అభ్యసించడం ద్వారా అతను నిద్రను జయించాడు. అలాగే రామాయణ కాలంలో వనవాస సమయంలో లక్ష్మణుడు కూడా ఇదే ఆచరించాడని పురాణాలు చెబుతున్నాయి.

మీరు యోగా నిద్రను 10 నుంచి 30 నిమిషాలు సరిగ్గా సాధన చేస్తే, 7 నుంచి 8 గంటల గాఢ నిద్రను 4 గంటల్లో పూర్తి చేయవచ్చు.

సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే?

వాల్ స్ట్రీట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్ తన పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి NSDRని అంటే నిద్రపోకుండా పూర్తి విశ్రాంతిని తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఇందులో నిద్రపోకుండానే కొత్త శక్తితో మరలా పనికి సిద్ధమవుతానని పేర్కొన్నాడు. NSDR చిట్కాలకు సంబందించిన వీడియోలు ఎన్నో యూట్యూబ్‌లో ఉన్నాయి. వీటిని అనుసరించి ఒత్తిడి లేకుండా చేసుకుకోవచ్చు. 10, 20 లేదా 30 నిమిషాల ఈ వీడియోలు ఒత్తిడి లేకుండా చేస్తాయనడంతో ఎలాంటి సందేహం లేదు.

సుందర్ పిచాయ్‌లాగే 8 గంటల నిద్రను పూర్తి చేయలేని ఎందరో నిపుణులు నేడు చాలా మంది ఉన్నారు. మారుతున్న వర్క్ షిఫ్టుల వల్ల నిద్ర వేళలు పూర్తి చేసుకోలేని వారుకూడా ఉన్నారు. వీటికి తోడు ఓటీటీల దెబ్బకు అర్థరాత్రి వరకు మేల్కొని వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూస్తూ సరైన నిద్రపోలేని వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారంతా ఈ పద్ధతిని పాటిస్తే కచ్చితంగా ఒత్తిడిని తగ్గించుకుని, మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చు.

NSDR అంటే ఏమిటి?

నాన్-స్లీప్ డీప్ రెస్ట్ (NSDR) అనే పదాన్ని స్టాన్‌ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ ఆండ్రూ హుబెర్‌మాన్ ప్రపంచానికి పరిచయం చేశారు. NSDRలో మనం 20-30 నిమిషాలు కళ్ళు మూసుకుని పడుకోవాలి. ఆతర్వాత మనం 7-8 గంటల గాఢ నిద్ర నుండి మేల్కొన్నట్లుగా రిలాక్స్‌గా అనుభూతి చెందుతాం. స్టాన్‌ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో మెదడు పనితీరుపై పనిచేస్తున్న డాక్టర్ ఆండ్రూ హుబెర్‌మాన్, తాను స్వయంగా 10 ఏళ్లుగా NSDRని అభ్యసిస్తున్నానని, నిద్రపోవడానికి, ఏకాగ్రతతో ఉండేందుకు ఇది ఉత్తమ సాధనంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఎన్‌ఎస్‌డీఆర్ అనే పదం ప్రపంచానికి కొత్త కావచ్చు. కానీ, ఈ ప్రక్రియ మన దేశానికి వేల సంవత్సరాల క్రితమే పరిచయం అయింది. మన గ్రంథాలలో కూడా దీని గురించి వివరించారు. NSDR వెనుక యోగా నిద్ర ఉంది. ఇందులో మెదడులో ఉన్న న్యూరాన్లు వివిధ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో ఆల్ఫా తరంగాలు మనల్ని సంతోషంగా ఉంచడానికి పని చేస్తాయి. మనం ఒత్తిడికి గురైన రోజు మెదడులోని ఆల్ఫా తరంగాల కార్యకలాపాలు తగ్గుతాయి. యోగా నిద్ర, ధ్యానం మెదడులో ఆల్ఫా వేవ్ కార్యాచరణను పెంచుతుంది. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం.

మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్లినప్పుడు మన హృదయ స్పందన మందగిస్తుంది. మెదడు బీటా తరంగాల నుంచి ఆల్ఫా తరంగాలకు మారుతుంది. బీటా తరంగాలు చురుకైన మనస్సుతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే ఆల్ఫా తరంగాలు ప్రశాంత స్థితిలో మరింత చురుకుగా ఉంటాయి. ఆ తర్వాత మనం రిలాక్స్ అవుతాం.

యోగ నిద్ర కూడా బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేసే వ్యక్తులు ఇతర వ్యక్తుల కంటే మెరుగైన, లోతైన నిద్రను కలిగి ఉంటారని చాలా అధ్యయనాలు చూపిస్తున్నాయి.

యోగా నిద్ర పోవాలంటే ఏం చేయాలి?

స్టెప్ 1: నిశ్శబ్దంగా, మసక వెలుతురు ఉన్న ప్రదేశంలో మీ వెనుకభాగంలో పడుకోండి. శరీరాన్ని పూర్తిగా వదులుగా వదిలేయండి. మీ అరచేతులను తెరిచి ఆకాశం వైపు ఉంచండి.

స్టెప్ 2: తొలుత శ్వాసను గట్టిగా తీసుకోండి. ఆపై సాధారణంగా తీసుకుంటూ ఉండాలి. అలాగే దృష్టిని కుడి పాదం కాలి వేళ్లపై ఉంచాలి. ఈ సమయంలో మీ మనస్సులో యాదృచ్ఛిక ఆలోచనలు తీసుకురాకుండా ప్రయత్నించండి.

స్టెప్-3: మీ దృష్టిని కాలి నుంచి మోకాలి వరకు, తర్వాత తొడపైకి తీసుకురండి. ఆ తరువాత ఎడమ కాలుతో కూడా ఈ విధానాన్ని పునరావృతం చేయండి. ఇలా చేస్తున్నప్పుడు గొంతు, ఛాతీ మొదలైన వాటిపై దృష్టి పెట్టండి.

స్టెప్-4: లోతైన శ్వాస తీసుకోండి. ఈ స్థితిలో కొంత సమయం పాటు పడుకోండి. ఇప్పుడు చుట్టుపక్కల వాతావరణంపై దృష్టి పెట్టండి. కుడివైపు తిరిగి, ఎడమ నాసికా రంధ్రం ద్వారా ఊపిరి పీల్చుకోండి.

స్టెప్-5: ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాసేపయ్యాక మెల్లగా లేచి కూర్చోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి.

మన అనారోగ్యానికి 75 శాతం ఒత్తిడే కారణం..

మన అనారోగ్యానికి 75 శాతం కారణాలు ఒత్తిడికి సంబంధించినవని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒత్తిడితో దీర్ఘకాలిక ప్రభావాలు కూడా ఉంటాయి. దీని కారణంగా అల్జీమర్స్, అలర్జీలు, కీళ్లనొప్పులు, పొట్టకు సంబంధించిన వ్యాధులు కూడా ఎటాక్ చేసే అవకాశం ఉంది.

యోగా నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు..

ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.

నిద్ర లేక ఇబ్బంది పడుతున్న వారు మంచి నిద్రను పొందేందుకు సహాయపడుతుంది.

మనసును ప్రశాంతపరుస్తుంది. ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది. మానసిక అలసట దూరమవుతుంది.

శరీర నొప్పులను తగ్గిస్తుంది. అలసట, ప్రతికూల ఆలోచనను తొలగిస్తుంది.

Also Read: Migraine: మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.. మర్చిపోతే మరింత ఎఫెక్ట్..

Eggs: మీరు కోడి గుడ్లను అలా తింటున్నారా.. అయితే మీరు నష్టపోయినట్లే..