Chia Seeds Benefits: ప్రతిరోజు చియా సీడ్స్ తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

చియా గింజలను మల్టీవిటమిన్ మాత్రలా భావించవచ్చు. కొన్ని సంవత్సరాల కిందట ఈ గింజల గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు మాత్రం ఇవి ప్రతిచోటా కనిపిస్తున్నాయి. స్మూతీ బౌల్స్‌లోనూ, ఇన్‌ స్టాగ్రామ్‌ లో పుడ్డింగ్‌ ల్లోనూ చియా గింజలే దర్శనమిస్తున్నాయి. ఆరోగ్యవంతమైన ఆహారంగా చియా గింజలు ఇప్పుడు ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. మొక్కల ఆధారిత ఆహారం కోరుకునే వారివల్ల వీటి ప్రాచుర్యం పెరిగింది.

Chia Seeds Benefits: ప్రతిరోజు చియా సీడ్స్ తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
Chia Seeds Health Benefits

Updated on: Apr 28, 2025 | 11:03 PM

గుండె ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, బరువు నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ కోసం నిపుణులు చియా విత్తనాలను సూచిస్తున్నారు. ఫిట్‌నెస్‌ ను కోరుకునే వారు, బిజీ ప్రొఫెషనల్స్, ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకునే వారు.. ఇలా ఎవరి ఆహారంలోనైనా చియా గింజలు ముఖ్యంగా మారాయి.

చియా విత్తనాలను నేరుగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇవి ఆహార నాళంలో ఇరుక్కొని శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే చియా విత్తనాలను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం. ముందు నీటిలో నానబెట్టి తినడం మంచిది.

చియా విత్తనాలను నానబెట్టడం కేవలం అలంకారం కాదు. అవి నీటిని గ్రహించి జెల్ లాంటి పూతను తయారు చేస్తాయి. ఈ రూపంలో తినడం వల్ల శరీరానికి జీర్ణం సులభంగా జరుగుతుంది. ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3లు వంటి పోషకాలు చక్కగా విడుదలవుతాయి. నానబెట్టకుండా తింటే నీరు తగ్గి ఉబ్బరం, అసౌకర్యం కలగొచ్చు.

నానబెట్టిన చియా గింజలు కడుపుపై మృదువుగా ఉంటాయి. జీర్ణవ్యవస్థలో సజావుగా కదిలేలా చేస్తాయి. బాహ్య ఫైబర్ పొర తొలగి కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా-3లు వంటి పోషక పదార్థాలు శరీరానికి అందుతాయి. నానబెట్టకపోతే ఈ విలువైన పోషకాలు పూర్తిగా శరీరానికి ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి చియా విత్తనాలను నానబెట్టడం వల్ల పూర్తి ప్రయోజనం పొందడం సాధ్యం అవుతుంది.

నానబెట్టిన చియా గింజలు పుడ్డింగ్ లాంటి ఆకృతిని తీసుకుంటాయి. వీటిని స్మూతీలు, ఓట్‌మీల్, డెజర్ట్‌ల్లో వేసుకోవచ్చు. తినడానికి రుచికరంగా ఉంటాయి. కాబట్టి చియా విత్తనాలను వాడే ముందు కొద్దిసేపు నానబెట్టడం మంచిది.

బరువు తగ్గాలని చూసే వారు చియా గింజల ఫైబర్ వల్ల త్వరగా తృప్తి చెందుతారు. డయాబెటిస్ ఉన్నవారు చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగించుకోవచ్చు. అథ్లెట్లు, జిమ్‌కు వెళ్లేవారు శక్తి పెంపుదల కోసం వాడతారు. మలబద్ధకంతో బాధపడే వారికి ఫైబర్ సహాయపడుతుంది. శాకాహారులు ఒమేగా-3, ప్రోటీన్ కోసం చియా విత్తనాలను తీసుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)