మనిషి మహా బతికితే 60 ఏళ్లు.. ఇంకా ఆయుష్షు ఉంటే మరో పదేళ్లు. ఇంకా బతికినా అది మందులతోనే గడపాల్సిన దుస్థితి. అయితే ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విధానాలు, ప్రివెంటివ్ చికిత్సా విధానాలు మనిషి మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనిషి సగటు జీవిత కాలం బాగా పెరిగింది. వాస్తవానికి 1900 నాటి నుంచే మనిషి లైఫ్ స్పాన్ ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా వృద్ధి చెందింది. కొన్ని వ్యాక్సిన్లు, మరికొన్ని అధునికి వైద్య విధానాలను అభివృద్ధి చేయడంతోనే ఇది సాధ్యమైంది. అయితే దీనిని మరింత ఎక్కువ చేసేందుకు పరిశోధనలకు నడుం బిగించారు. ఆ దిశగానే చేసిన ప్రయోగాలు అద్భుత ఫలితాలు వచ్చాయని పరిశోధకులు వెల్లడించారు. దాదాపు 120 సంవత్సరాలు మనిషి ఆరోగ్యంగా బతకడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో రెండేళ్లలోనే ఇది మనం చూస్తామని వివరిస్తున్నారు.అంతేకాక ఈ శతాబ్దం చివరికి మానవులు 150 సంవత్సరాలు బతకగలిగేలా స్టెమ్ సెల్స్ పై పరిశోధనలు చేస్తున్నామని పరిశోధకులు చెబుతున్నారు. ఏ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
యూసీఎల్ సీఏలోని డేవిడ్ జెఫెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా హాస్పిటల్ లో ట్రిపుల్ బోర్డ్-సర్టిఫైడ్ ఇంటర్నిస్ట్, కార్డియాలజిస్ట్, సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్‌లో గుండె మార్పిడి కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ ఎర్నెస్ట్ “సీక్రెట్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ”, “ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ స్టెమ్ సెల్ థెరపీ” వంటి పుస్తకాలను రాశాడు. ఆయన మాట్లాడుతూ మానవ జీవిత సమయాన్ని పొడిగించగలమని తాను నముతున్నానన్నారు. బహుశా రెండేళ్లలోనే 120 నుంచి 150 సంవత్సరాలోపు జీవించగలగుతారని వివరిస్తున్నారు. అది కూడా పూర్తి ఆరోగ్యంతో బతకలుగుతారని చెబుతున్నారు. బెడ్ పై ఒకరి సాయంతో కాకుండా వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారని స్పష్టం చేస్తున్నారు. అయితే తినే ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్టెమ్ సెల్స్ (మూల కణాలు)ద్వారా ఇది సాధ్యమవుతుందని డాక్టరఱ్ ఎర్నెస్ట్ చెబుతున్నారు. తాము ఇప్పటికే రియాక్టివ్ మెడిసిన్ ని వినియోగిస్తున్నామని.. దీనిని సాధారణంగా స్టెమ్ సెల్ థెరపీలలో వినియోగిస్తారని చెబుతున్నారు. మూల కణాలను ఎఫ్డీఏ ఆమోదించనప్పటికీ.. భవిష్యత్తులో ఇది డ్యామేజ్ రిపేర్ గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. తద్వారా ఎక్కువ కాలం జీవించడానికి దోహదపడుతుందని డాక్టర్ ఎర్నెస్ట్ చెబుతున్నారు. ఇది యాంటీ ఏజింగ్ గా ఉపయోగపడుతుందంటున్నారు.
అధికారిక రికార్డుల ప్రకారం, మానవజాతి చరిత్రలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే 120 సంవత్సరాల వయస్సు వరకు జీవించాడు. 1997లో మరణించిన ఫ్రాన్స్‌కు చెందిన జీన్ కాల్మెంట్, 122 సంవత్సరాల 164 రోజుల వయస్సులో మృతి చెందాడు. అయితే దీనిపైనా చాలా సందేహాలు ఉన్నాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..