బీ అలర్ట్..ఆహారాన్ని వండిన వెంటనే తినడం లేదా ? అయితే ఇది మీ కోసమే

|

Jan 16, 2025 | 2:28 PM

కొన్ని ఆహారాలను మళ్లీ వేడి చేయడం వల్ల అవి విషపూరితంగా మారుతాయి. బచ్చలికూర, క్యారెట్, ముల్లంగి వంటి కూరగాయలలో నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మళ్లీ వేడి చేయడం ప్రమాదకరం. రైస్, ఎగ్స్, చికెన్ లాంటి వాటిలో బాక్టీరియా పెరిగి ఆహారాన్ని విషపూరితం చేస్తుంది. బంగాళదుంపలు, పుట్టగొడుగులు మళ్లీ వేడి చేయడం వల్ల వాటి పోషకాలు దెబ్బతింటాయి. నూనెలు పదేపదే వేడి చేయడం కూడా ఆరోగ్యానికి హాని చేస్తుంది. సీఫుడ్ విషపూరితం కాకుండా వండిన వెంటనే తినాలి. మొత్తం మీద, ఆహారాన్ని తాజాగా వండి వెంటనే తినడం ఆరోగ్యానికి మంచిది.

బీ అలర్ట్..ఆహారాన్ని వండిన వెంటనే తినడం లేదా ? అయితే ఇది మీ కోసమే
Foods You Should Never Reheat Again
Follow us on

మన ఇంట్లో పెద్దవాళ్లకి ఇంకా కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే కొన్ని వంటలు చేశాక చల్లగా ఉందని వేడి చేయడం లేదా మిగిలిన ఆహారాన్ని వేడి చేసి తినడం వంటిది. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకి వేడి చేయకూడని ఆహారాలు ఏంటి.. ఎందుకు వేడి చేసి తింటే ఆరోగ్యానికి హనికరం అని నిపుణులు అంటున్నారో తెలుసుకుందాం.

బచ్చలికూర, క్యారెట్, ముల్లంగి

ఈ కూరగాయల్లో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. మళ్లీ వేడి చేయడం వల్ల ఇది విషపూరితంగా మారుతుంది. ముఖ్యంగా బచ్చలికూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని కనుక మళ్లీ వేడి చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

రైస్ తో జాగ్రత్త

వండిన రైస్ ని ఫ్రిజ్‌లో ఉంచి మళ్లీ వేడి చేస్తే అందులో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఆహార పదార్ధాన్ని విషపూరితం చేసే అవకాశం ఉంది. కాబట్టి రైస్ తాజాగా తినడం లేదా నిల్వ ఉంచే పద్ధతులను పాటించడం అవసరం.

ఎగ్స్ వెంటనే తినడం మంచిది

ఎగ్స్ ప్రోటీన్‌తో నిండిన ఆహారం. కానీ మళ్లీ వేడి చేయడం వల్ల ప్రోటీన్ విషపూరిత లక్షణాలను పొందుతుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. కాబట్టి ఎగ్స్ తో చేసిన ఏ రకమైన వంటనైనా సరే వెంటనే తినడం మంచిది.

చికెన్ కర్రీ

చికెన్‌ను ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు వేడి చేస్తే అది జీర్ణక్రియకు ఇబ్బందిని కలుగజేస్తుంది. ప్రోటీన్లు ఎక్కువ ఉండడంతో మళ్లీ వేడి చేయడం వల్ల అవి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి చికెన్‌ను తాజాగా వండి తినడం మంచిది.

బంగాళదుంపలు

బంగాళదుంపల్లో పొటాషియం, విటమిన్ C లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వీటిని మళ్లీ వేడి చేస్తే అందులో క్రిములు పెరిగి, ఆహారం విషపూరితంగా మారుతుంది. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

పుట్టగొడుగులు

పుట్టగొడుగులను వండిన వెంటనే తినాలి. మళ్లీ వేడి చేయడం వల్ల అజీర్తి సమస్యలు రావచ్చు. కాబట్టి పుట్టగొడుగులను తాజాగా వండుకొని తినడం మంచిది.

ఆయిల్స్

ఆలివ్ నూనె, అవిసె నూనె వంటి నూనెల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవి పదేపదే వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నూనెలను వేడి చేయకుండా వాడే పద్ధతిలో చేసి ఉపయోగించుకోవడం మంచిది.

సీఫుడ్

సీఫుడ్‌ని వండిన వెంటనే తినాలి. ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేస్తే ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. కాబట్టి సీఫుడ్‌ను తాజాగా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది.

ఇలా కొన్ని ఆహారాలను మళ్లీ వేడి చేయడం వల్ల అవి విషపూరితంగా మారే అవకాశాలు ఉంటాయి. నైట్రేట్, ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్లు ఉన్న పదార్థాలు మళ్లీ వేడి చేయకూడదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వండిన వెంటనే ఆహారం తీసుకోవడం చాలా మంచిది.