
చాలా మంది ఏమీ చేయకుండానే తొందరగా అలసిపోతారు. ఈ సమయంలో వారు చాలా నిద్ర,నీరసంగా ఉంటారు. అందుకు కారణం శరీరానికి కావలసిన పోషకాహారాన్ని తీసుకోపోవడమే. అందువల్ల శరీరానికి శక్తిని అందించేందుకు, అలసటను అధిగమించేందుకు కొన్ని రకాల పోషకాలను ఆహారంగా తీసుకుంటే సరి. అందుకోసం ఈ నాలుగు రకాల ఆహారాన్ని మీ డైట్ ప్లాన్‌లో భాగం చేసుకోండి..

అరటిపండ్లు: అరటిపండులో డైటరీ ఫైబర్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇది శరీరానికి కావలసిన శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాక బలహీనత, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం చేకూర్చడమే కాక అనేక రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అరటిపండ్లను నేరుగా తినవచ్చు లేదా స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు.

వాల్ నట్స్: వాల్ నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది ఒమేగా 3కి అద్భుతమైన మూలం. రోజంతా శక్తివంతంగా ఉండేందుకు మీరు వాల్‌నట్స్‌ను తీసుకోవచ్చు. ఇది అలసట, బద్ధకాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

గుమ్మడి గింజలు: గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో ఈ లోపం కలగకుండా చేస్తుంది. మెగ్నీషియం లోపం వల్లనే తరచూ శరీరం అలసిపోతుంది. అందువల్ల మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాలను ఇంకా గుమ్మడి గింజలను తీసుకోవాలి.

విటమిన్ డి: విటమిన్ డి లోపం వల్ల కూడా శరీరం అలసట చెందుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. అందుకోసం మీరు పాలు, గుడ్లు, పుట్టగొడుగులు వంటి ఆహారాలను తినాలి. వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉండడం వల్ల మీరు అలసట చెందకుండా ఇవి సహాయపడతాయి.