
లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది. అందుకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ సైలెంట్ కిల్లర్ లా ముంచుకువస్తాయి. మనం అప్రమత్తమయ్యేలోపే శరీరానికి జరగాల్సిన నష్టం జరుగుతుంది. అందుకే లివర్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదంలో కాలేయాన్ని శుద్ధి చేసే ఎన్నో రకాల పద్దతులు ఉన్నాయి. సింపుల్ చిట్కాలతో ఎవరైనా ఈ పనిచేసుకోవచ్చు. సరైన సమయానికి తినకపోవడం, మారుతున్న జీవనశైలి అలవాట్లు, మద్యం, సిగరెట్ వంటి వ్యసనాలు లివర్ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఆయుర్వేదంలో లివర్ సమస్యలకు ఎంతో విలువైన మార్గాలను సూచించారు. అందులో కొన్ని..
ఉసిరికాయలో ఉండే ఔషధ గుణాలు లివర్ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడతాయి. ఎంత చెడిపోయిన లివర్ అయినా దాన్ని తిరిగి రిపేర్ చేయగల శక్తి ఉసిరికి ఉంది. లివర్ సెల్స్ ను హెల్తీ గా ఉంచేందుకు ఉసిరిని పొడి రూపంలో గానీ, క్యాండీలు, జ్యూస్ ఇలా ఏ రకంగా అయినా మీ డైట్ లో భాగం చేసుకునేలా ప్లాన్ చేసుకోండి.
ఎడారి మొక్కలా కనిపించే అలోవెరాలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం పరిగడుపున ఒక చెంచా అలొవెరా గుజ్జును శుభ్రం చేసి తీసుకోవడం వల్ల మీ లివర్ సేఫ్ జోన్ లో ఉన్నట్టే. లేదా జ్యూసుల్లో కలుపుకున్నా సరే. అయితే, మరీ ఎక్కువ తీసుకోవడం వల్ల విరేచనం అవుతుందని గుర్తుంచుకోవాలి.
మందు, సిగరెట్ల కారణంగా అప్పటికే దారుణంగా డ్యామేజ్ అయిన లివర్ ను సైతం పునర్నవతో తిరిగి గాఢిలో పొట్టొచ్చు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. షాపుల్లో పునర్నవ పొడి లేదా టానిక్ ల రూపంలో అందుబాటులో ఉంది. దీనిని వైద్యుల సాయంతో తీసుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)